దేశానికి కావాల్సిన ఆయుధ సంపత్తికి డీఆర్డీవో మూలం. ఇలాంటి అతి పెద్ద రక్షణ రంగ సంస్థలో యువశక్తిని ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. దీనికి అనుకూలంగానే చాలా మంది యువత ఇప్పుడు తమ శక్తిని డీఆర్డీవోలో చూపించేందుకు అవకాశం కల్పించారు. వీరు ప్రయోగాల్లో విఫలమైన పర్లేదు కనీసం అనుభవం అయినా వస్తుంది.


బెంగళూరు ఐఏఎస్సీలో ఉన్న ల్యాబ్ ఆర్టీపిషీయల్ ఇంటిలిజెన్స్, ఐఐటీ బొంబైలో నెలకొల్పిన ల్యాబ్ క్వాంటమ్ టెక్నాలజీ మీద పని చేస్తాయి. ఐటీ మద్రాస్ లో ఏర్పాటు చేసిన ల్యాబ్ కాగ్నిజెంట్ టెక్నాలజీ పైన పని చేస్తే, మిగతా రెండు యంగ్ ల్యాబ్ లు హైదరాబాద్ లోనే పని చేస్తాయి. అసలు ఉద్దేశం ఏమిటింటే అసిమెట్రిక్ ల్యాబ్ ల్లో యువత పని చేస్తున్నారు. అసిమెట్రిక్ విధానంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయుధాలను విధ్వంసం చేసే ప్రక్రియను ప్రస్తుతం యూత్ పని చేస్తోంది.


ఈ సూత్రం ఆధారంగా రక్షణ రంగానికి యువత సహాయపడనుంది. అయితే యువ బృందం ప్రధాన లక్ష్యం కృత్రిమ మేధ, ఆర్టిపిషీయల్ ఇంటిలిజెన్స్ విభాగంలో పని చేయడం. ఆ సాంకేతికత ద్వారా నేల, నింగి, నీటిపై శత్రువులపై మూకుమ్మడి దాడి చేసే లా డ్రోన్లు, రోబోలు, ఇతర వివిధ రక్షణ పరికరాలు తయారు చేయడం యువత పని. నెట్ వర్క్ సెంట్రిక్ పనులను సృష్టించడం పెద్ద పని. ఇలాంటి అన్ని పనులను యువతరం సీనియర్ సైంటిస్టులతో కలిసి చేయాలి.


సీనియర్ సైంటిస్టులు ఆలోచిస్తారు. కానీ సాహాసాలు చేయరు. ఇప్పుడు సాహసం చేయాలంటే యువత అయి ఉండాలి. విజయం సాధిస్తే అతని కన్న గొప్ప పోరాట యోధుడు ఎవరూ లేరని ప్రపంచం కీర్తిస్తుంది. అందుకే ప్రధాని దేశ యువతకు సువర్ణవకాశం కల్పించి రక్షణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. వారి టాలెంట్ ఎంత ఉందో నిరూపించుకునేలా ఇస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రక్షణ రంగాన్ని పటిష్టం చేయడానికి వారు కృషి చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: