ప్రిగోజిన్.. వ్యాగనర్ యుద్ధ వ్యుహాలు తెలిసిన చాణక్యుడు అని అంటుంటారు. అయితే రష్యా పై తిరుగుబాటు అనంతరం ఆయన బెలారస్ లో తల దాచుకున్నారని ఉక్రెయిన్ కు తెలిసింది. దీంతో మళ్లీ ఉక్రెయిన్ పై ఎప్పుడు తన ప్రైవేటు సైన్యంతో విరుచుకుపడతాడోనని జెలెన్ స్కీ ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం.. బాగ్ పుత్ నగరాన్ని చేజిక్కించుకోవడంలో వ్యాగనర్ సైన్యం భీకర దాడులు చేసింది. చాలా పటిష్ట మైన ప్రాంతం శత్రు సైన్యం రాలేని బాగ్ పుత్ ప్రాంతానికి వ్యాగనర్ సైన్యం చొచ్చుకెళ్లింది.
ఇలా వెళ్లడం వల్ల బాగ్ పుత్ నగరాన్ని ఉక్రెయిన్ వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు బెలారస్ లో ఆయన తల దాచుకున్నట్లు తెలవడంతో ఉక్రెయిన్ తో పాటు పోలాండ్ వణికిపోతుంది. ఎక్కడ తమ దేశాలపై మెరుపు దాడి చేస్తారోనని కలవరపడుతున్నాయి. ఒక వేళ దాడి చేస్తే తిప్పి కొట్టేలా ఉక్రెయిన్ దాదాపు అయిదు వేల మంది సైన్యాన్ని బెలారస్ సరిహద్దుల్లో మోహరించారు. అందులో సుశిక్షుతులైన 2000 మందిని ఇప్పటి కిప్పుడు దాడి చేస్తే ఎదుర్కొనేలా సరిదిద్దారు.
పోలండ్ కూడా 200 మంది శక్తివంతమైన సైనికులను సరిహద్దుల్లో కాపలాగా పెట్టుకుంది. పోలండ్ కూడా ప్రస్తుతం వ్యాగనర్ బెలారస్ లో ఉండడం వల్ల వణికిపోతుంది. రష్యా, వ్యాగనర్ కలిసి పోలండ్ పై ఎక్కడ దాడి చేస్తారోనని కలవరపడుతుంది. ఒక వేళ దాడి చేస్తే అది యూరప్ దేశాలు, రష్యా యుద్దంగా మారడం ఖాయం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి