అయితే బీజేపీ తరఫున కిషన్ రెడ్డి ని పెట్టడం వల్ల రెడ్డి సామాజిక వర్గం ఓట్లను రాబట్టొచ్చని బీజేపీ అధిష్ఠానం ఆలోచిస్తుందా? లేక వ్యుహాల్లో భాగంగా మార్చాలని ప్రయత్నిస్తోందా? ఇలా బీజేపీ చేస్తున్న మార్పులు బీజేపీకి కలిసొస్తాయా? మొదటికే మోసం వస్తుందా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మణిపూర్, గోవా, హర్యానా లాంటి చోట్ల ముఖ్యమంత్రులను మార్చాలని కూడా ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో బీజేపీ వచ్చే ఎన్నికలకు ముందే సర్వ సన్నద్ధంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎన్నికలకు వెళ్లే సమయం వరకు ప్రజల్లో కమలం పార్టీపై నమ్మకం కలిగేలా ఉండాలంటే నాయకులను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
అయితే ఇప్పుడు బండి సంజయ్, సోము వీర్రాజును మార్చిన వారికి వచ్చిన నష్టమేం లేదు. కానీ వారిని తెలుగు రాష్ట్రాల్లోని మీడియా ఇప్పటికే ఒక వంద సార్లు మార్చేశాయి. ఇలా ఆ నాయకులపై జీవితాలతో మాత్రం మీడియా ఆడుకుందని కచ్చితంగా చెప్పొచ్చు. మరి బీజేపీ అధిష్టానం కిషన్ రెడ్డిని చేశాక బీజేపీ క్షేత్ర స్థాయిలో ఎలా ఉండబోతుంది. ఓటింగ్ శాతం పెరుగుతుందా.. లేక గతంలో లాగానే బీఆర్ఎస్ ను అధికారం కట్టబెడతారా అనే ఆరోపణలు వస్తున్నాయి. చూడాలి అధ్యక్షుల మార్పు ఏ విధంగా మారబోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి