తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. దీంతో ప్రధాన పార్టీలు గెలిచే స్థానాలు లెక్కలు వేసుకుంటున్నాయి. అవి జారిపోకుండా ప్రచారం చేసుకుంటున్నాయి.  పోటీ ముఖ్యంగా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల్లో తలపడుతుంటే.. బీజేపీ మాత్రం ఓ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.


ముఖ్యంగా బీజేపీకి ప్రధాని మోదీ తప్ప అంతటి చరిష్మా కలిగిన నాయకులు ఎవరూ లేరు. ప్రధాని మోదీ అనే బలమే తమను గట్టెక్కిస్తోందని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. స్థానికంగా బలమైన నాయకులు లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా చెప్పవచ్చు.  పార్టీని గాడిన పెట్టి పట్టాలెక్కిస్తున్న సమయంలో బండి సంజయ్ ని తప్పించి ఆ పార్టీ చారిత్రక తప్పిదం చేసింది. ఇప్పుడు బీసీ సీఎం అనే అంశం తెరపైకి తెచ్చినా ఆ పార్టీని ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు.


అయితే ప్రధాని చరిష్మా ఎంతవరకు గట్టెక్కిస్తుందో చూడాలి. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం చాలా తక్కువ. ప్రధానికి అంత పలుకుబడే ఉంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ఎన్నికల్లో కచ్ఛితంగా ఆ పార్టీనే గెలుస్తుంది బీజేపీ చెప్పగలదా అంటే అనుమానమే. మరోవైపు అత్యంత ప్రజాధారణ కలిగిన ప్రపంచ నేతల్లో మోదీ ఒకరు.


ఇంతవరకు బాగానే ఉన్నా.. మోదీని కొన్ని రాష్ట్రాల ప్రజలు ప్రధానిగా మాత్రమే చూస్తారు. తెలంగాణ విషయానికొస్తే 2018 ఎన్నికల్లో 1అసెంబ్లీ స్థానం దక్కించుకున్న బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో 4 స్థానాలను గెలుచుకుంది. అంటే ప్రధాని అభ్యర్థిత్వానికి బీజేపీకి మద్దతిస్తారు కానీ రాష్ట్రంలో అధికారం ఇవ్వడానికి సిద్ధపడరు. అలాగే బీజేపీ బలంగా పోరాడితే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీనే. ఉదాహరణకు గజ్వేల్ ని తీసుకుంటే ఈటల రాజేందర్ బరిలో లేకుంటే కాంగ్రెస్ అక్కడ రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలాగే బీజేపీ ప్రభావం చూపే ప్రతి చోట కాంగ్రెస్ కు మైనస్ గా మారుతుంది. బీఆర్ఎస్ కు లాభిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP