అయితే ఎన్నడూ లేని విధంగా ఈ సారి పార్టీకి సానుకూలంశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో మొదటిది తెలంగాణ ఇచ్చినా పదేండ్లు దూరంగా ఉండటంతో ప్రజల్లో కొంత సానుభూతి నెలకొంది. సహజంగా అధికారంలో ఉన్న పార్టీపై వ్యతిరేకత ఉంటుంది. దీనిని కాంగ్రెస్ పార్టీ రెండు చేతులా అంది పుచ్చుకుంది. ఎప్పుడూ విభేదాలతో సతమతం అవుతూ ఒకరిని ఒకరు ఓడించే సంస్కృతి ప్రస్తుతం హస్తం పార్టీలో కనిపించడం లేదు. ఇదే సందర్భంలో అందరూ ఐక్యతా రాగం అందుకున్నారు. మరోవైపు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సంచలనాత్మక మేనిఫెస్టోని విడుదల చేసి దానిని ప్రజల్లోకి అయితే తీసుకు వెళ్లగలిగారు. టీడీపీ మద్దతు, ఏఐసీసీ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఆ పార్టీ బలంగా మారింది.
ప్రతికూలతల విషయానికొస్తే దాదాపు బలమైన నేతలంతా కూడా హస్తం నుంచి వలస వెళ్లారు. అభ్యర్థుల ఎంపికలో కూడా పారాచ్యూట్ నేతలకు ఎక్కువగా అవకాశమిచ్చారు. ముస్లిం ఓట్లపై ఆశ పెట్టుకున్నా.. కాంగ్రెస్ కే పడతాయనే నమ్మకం లేదు. అన్నింటకన్నా ప్రధానమైన ఆర్థిక వనరుల విషయంలో హస్తం బాగా వెనుకబడి ఉంది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉండటంతో కేడర్ లో నైరాశ్యం నెలకొంది. వీటన్నింటిని అధిగమించి హస్తం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా లేదా చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి