జనసేన, తెలుగు దేశం మధ్య సమన్వయం అనేది ఇప్పటి నుంచే చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ నియంతృత్వ పోకడలను ఎదిరించాలనుకుంటే కచ్చితంగా ఒక పక్కా ప్రణాళికతో చేయాల్సిన అవసరముంది. ఆంధ్రలో కచ్చితంగా మార్పు రావాలని కోరుకుంటున్న జనసేన, తెలుగు దేశం పార్టీ సీట్ల పంపకాల గురించి సరైన విధానంతో ముందు కెళ్లాల్సిన అవసరముంది. ఎందుకంటే ఆయా స్థానాల్లో నిల్చొనే వారు ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేసి ఉంటారు.


వారు తమకే సీటు వస్తుందని నమ్మకంతో ఉంటారు. కానీ టీడీపీ, జనసేన అంతిమ లక్ష్యం జగన్ సర్కారును ఓడించడం.. దీని కోసం కొన్ని స్థానాల్లో టీడీపీ నాయకులు, మరి కొన్ని స్థానాల్లో జనసేన పట్టు విడుపులు పాటించాలి. అయితే దీనికి ఒక ప్రణాళిక అవసరం. ముఖ్యంగా  రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇబ్బంది పడకుండా ఇప్పటి నుంచే ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్ లలో ఎవరూ పోటీ చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


అయితే జరుగుతున్న లోపం ఎంటంటే టీడీపీ జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారన్నది తేలడం లేదు. ప్రస్తుతం ఆళ్లగడ్డ లో భూమ అఖిల ప్రియ మాట్లాడుతూ.. చంద్రబాబు తమకే టికెట్ ఇస్తారని కన్పర్మ్ చేశారని చెప్పుకొచ్చారు.  అయితే హైదరాబాద్ కు చంద్రబాబు పిలిపించి టికెట్ ఓకే అన్నట్లు భూమ అఖిల ప్రియ వర్గం ప్రచారం చేసుకుంటుంది. మరో పక్క జనసేన నుంచి రాం పుల్లా రెడ్డికి కూడా ఆళ్ల గడ్డ టికెట్ ఓకే అయిందని అనుకుంటున్నారు.


అయితే తూర్పు గోదావరి, అనంతపురం, చిత్తూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో టికెట్ల పంచాయతీ ఎక్కువగా ఉండనుంది. ఎక్కడెక్కడ జనసేన సీట్లు అడగబోతుందో అక్కడక్కడ టీడీపీ నాయకులు కూడా పోటీ పడుతున్నారు. కాబట్టి సీట్ల పంచాయతీని ఎంత త్వరగా తేల్చుకుంటే అంత మంచిదనే అభిప్రాయం ఇరు పార్టీల నాయకుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: