ఆయన మళ్లీ పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపుతుండటం ఇక్కడ వివేక్ రామస్వామికి అడ్డంకిగా మారనుందా లేక వివేక్ రామస్వామినే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించడానికి వారు మొగ్గు చూపుతారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే వివేక్ రామస్వామి మాట్లాడుతూ.. తాను అమెరికా లో పుట్టినప్పటికీ తను ఆచరించే మతం హిందు ధర్మమేనని తేల్చి చెప్పారు. అమెరికా అనేది అన్ని మతాలను ఒకేలా ఆదరిస్తుందని కాబట్టి తాను హిందువునేనని తన మతాన్ని ఆచరించడంలో ఎక్కడా కూడా సందేహించనని చెప్పుకొచ్చారు.
అమెరికా దేశానికి అధ్యక్షుడిని కావాలనుకుంటే తనకు తన హిందు మతం ఎక్కడా కూడా అడ్డురాదని ప్రకటించారు. అమెరికాలో అన్ని మతాలను సమానంగా చూస్తారని చెప్పారు. ప్రపంచంలోనే పెద్దన్న పాత్ర పోషించే దేశం తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థి ధైర్యంగా హిందువునని చెప్పడం ఇక్కడ హర్షించదగిన విషయం. ముఖ్యంగా భారత దేశంలో ఎన్నికలు అనగానే కులం, మతం అని కొట్టుకునే వారు... టోపిలు పెట్టుకుని కండువాలు కప్పుకోవాలనుకునే వారు ఉన్నారు.
అలాగే తాను హిందువునని చెప్పుకుంటే ఎక్కడ మైనార్టీల ఓట్లు పడవోనన భయపడే వారు కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంటో ఒక అగ్రరాజ్యానికే అధిపతి కాబోతున్న వ్యక్తి నేను హిందువునని హిందు ధర్మాన్ని ఆచరిస్తానని గర్వంగా చెప్పడం ఇక్కడి రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాలు చేసే వారికి ప్రజా పాలన ఎంత అవసరమో తను జన్మించిన మూలలు కూడా మరిచిపోకూడదని చెప్పిన వివేక్ రామస్వామి లాంటిి రాజకీయ నాయకులు ఆదర్శవంతులను చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి