రాబోయే ఎన్నికల్లో జనసేనతో పొత్తు కు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ బీజేపీతో పొత్తు అనేది టీడీపీకి జాతీయ స్థాయిలో ఎంతో అవసరం. ఎందుకుంటే జగన్ ను రాష్ట్రంలో అడ్డుకుని, కేంద్రంలో చక్రం తిప్పాలన్నా.. కేంద్రంలో మళ్లీ ఒక వేళ బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నిధులు రావాలన్న బీజేపీ పార్టీతో పొత్తు తప్పక అవసరం. అయితే బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడుని అంతగా నమ్మడం లేదు.
దీనికి కారణం లేకపోలేదు.. 2014 లో చంద్రబాబు గెలిచిన తర్వాత చివరి సంవత్సరం ఎన్నికల సమయంలో బీజేపీతో తెగ దెంపులు చేసుకుని రాష్ట్రంలో బీజేపీని పూర్తిగా బదనం చేశారు. కాబట్టి మోదీ చంద్రబాబుపై నమ్మకం ఉంచలేకపోతున్నాడు. ఇలాంటి సమయంలో బీజేపీకి నమ్మకం కలిగించేలా చేయాలంటే ఇక్కడ ఎక్కువగా ఎంపీ స్థానాలను గెలుచుకోవాలి. దాదాపు 15 పైగా ఎంపీ స్థానాలను గెలుచుకుని అక్కడ బీజేపీకి మద్దతు తెలిపితే అప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో టీడీపీకి ఎదురుండదు.
ఎలాగో కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బీజేపీకి అంతగా పట్టు లేదు. తెలంగాణలో కూడా 5 కు మించి స్థానాలు రావాలంటే శ్రమించాల్సిందే.. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకుని బీజేపీకి దగ్గరయితే అటు కేంద్రంతో పనులు చేయించుకోవచ్చు. ఇటు రాష్ట్రంలో జగన్ భరతం పట్టవచ్చు అని టీడీపీ భావిస్తుంది. దీని కోసం చంద్రబాబు తన సీనియారిటీని అంత ఉపయోగించి ఎలాగైనా బీజేపీని మచ్చిక చేసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఎవరితో పొత్తు తొందరగా కుదురుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి