ఇరాక్ ను దెబ్బతీయాలనే కారణం తోనే వాళ్ళని ఆర్థికపరంగా బలోపేతం చేసింది. అలాగే సాయుధ శిక్షణను కూడా ఇచ్చింది అమెరికా. అయితే ఈ హమాస్ తీవ్రవాదులు తమకు శిక్షణ ఇచ్చిన గురువు మీదే ఇప్పుడు విల్లు ఎక్కుపెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఈ తీవ్రవాద సంస్థలన్నీ అమెరికాకి ఇరాక్ లో దెబ్బ కొడుతూ వస్తున్నాయి. దాంతో తీవ్రవాద సంస్థలకు సంబంధించిన ఇరాన్ కు అమెరికా వార్నింగ్స్ ఇస్తూ వస్తుంది.
పాలస్తీనాకు సంబంధించిన హమాస్ తీవ్రవాదులు గాని, మరొకరు గాని ఇజ్రాయిల్ పై దాడి చేస్తుంటే అటు ఇజ్రాయిల్ కి అండగా నిలుస్తూ వస్తుంది అమెరికా. అయితే పాలస్తీనా సమస్య ఖచ్చితంగా పరిష్కారం కావాలంటే అక్కడ అధికారం ఇజ్రాయిల్ చేతికి వెళ్ళాలి. అక్కడున్న ప్రజల అభిప్రాయం ప్రకారం స్థానిక పరిపాలన అయినా ఉండాలి లేదా ఇజ్రాయిల్ పర్యవేక్షణలో అయినా ప్రభుత్వం నడుస్తూ ఉండాలి.
పరిపాలన ఇలా కానీ ఉండకపోతే హమాస్ తీవ్రవాదులు ఇతర తీవ్రవాదులు కూడా రెచ్చిపోతూ ఉంటారు. అలా వారికి చనువిస్తే మాత్రం తమను కూడా ఇబ్బంది పెట్టేస్తారంటూ ఇజ్రాయిల్ చెప్పుకు వస్తుంది. దాంతో ఇప్పుడు ఇజ్రాయిల్ కీలకమైన అడుగులు వేస్తుంది. రేపో మాపో పాలస్తీనాను ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకోవడం ఖాయం. అయితే ఇప్పుడు పాలస్తీనా ను పరిపాలించకుండా ఇజ్రాయిల్ కు అడ్డుపడుతుంది అమెరికా . దానికి బదులుగా పాలస్తీనాకు సంబంధించిన వాళ్ళకి పరిపాలన అధికారాలు వచ్చేలా, వాళ్ళు తన కంట్రోల్లో ఉండేలా చూసుకుంటుంది అమెరికా. ఒకరకంగా ఇది అమెరికా చేసే అతి పెద్ద తప్పు అని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి