జనసేన ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతోంది. కానీ ఇంత వరకు సరైన విజయం దక్కలేదు. 2014లో రాష్ట్రంలో టీడీపీకి, కేంద్రంలో బీజేపీకి పవన్ మద్దతు తెలిపారు. ఆయన అనుకున్నట్లే రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కానీ పవన్ మాత్రం తన పార్టీని విస్త్రృతం చేయలేకపోయారు. సంస్థాగతంగా బలోపేతం కాలేకపోయారు. అది ముమ్మాటికీ జనసేనకు లోటే.


2014-19 వరకు పార్టీ బలోపేతానికి అవకాశం కనిపించింది. కానీ దానిని సద్వినియోగం చేసుకోవడంలో పవన్ కల్యాణ్ విఫలం అయ్యారు. దాని పర్యావసానమే 2019లో ఆపార్టీ ఘోర ఓటమి. చివరకు పవన్ తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓటమిపాలయ్యారు. తనకు జై కొట్టిన జనం వెం వచ్చిన లక్షలాది మంది జనం ఆయనకు అండగా నిలవలేదు. అభిమానం ఓటు రూపంలో మారలేదు. దానిని గుర్తు చేసుకొని పవన్ ఇప్పుడు రాజకీయాలు మొదలు పెట్టారు.


టీడీపీతో పొత్తు పెట్టుకొని 24 స్థానాల్లో పోటీకి పవన్ కల్యాణ్ అంగీకరించారు. అయితే ఇక్కడే జనసేన చుట్టూ వివాదాలు చుట్టుకుంటున్నాయి. మిమ్మల్ని ఒక ఆశాకిరణంగా చూసుకొని రాజ్యాధికారం దక్కించుకోవాలని కాపు సామాజిక వర్గ ప్రతినిధులు ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇలా ప్రశ్నించిన వారిని పవన్ నేరుగా విమర్శిస్తున్నారు. నాడు రెండు చోట్ల పోటీ చేస్తే.. ఒక్కచోట గెలవలేకపోయారు. నాడు గెలిచే ఉంటే ఇప్పుడు పొత్తులో భాగంగా సింహ భాగం ప్రయోజనాలు అడిగి ఉండేవాడినని చెబుతున్నారు.


ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం ఉన్నా.. పవన్ పనితీరు కూడా మెరుగు పడాల్సి ఉంది. దిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని స్థాపించారు. మిగతా రాష్ట్రాలకు పార్టీని విస్తరించగలిగారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని హైలెట్ చేసుకొని పార్టీని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. ఏపీ సీఎం జగన్ సైతం పట్టుదలతో పార్టీ స్థాపించారు. అదే ఉత్సాహంతో జనాల్లోకి వెళ్లి విజయం సాధించారు. అయితే ఈ స్థాయిలో పవన్ పోరాటం ఉందా.. లేదా అన్నది ఆయనే విశ్లేషించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: