హిమచల్ ప్రదేశ్ లో మొదలైన రాజకీయ అలజడి మరో రెండు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోను ప్రకంపనలు సృష్టిస్తోంది.  దిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున తెర వెనుక వ్యవహారాలు నడుస్తున్నాయన్న ప్రచారం జోరందుకుంది. దిల్లీలను ఇదే అంశంపై జోరుగా చర్చ జరుగుతుంది. హిమచల్ ప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు.


మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమారుడు, ప్రస్తుత మంత్రి విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. వీళ్లంతా బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. దీంతో హిమచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. మరోవైపు మరో తొమ్మిది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని రెబల్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. హిమచల్ లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు.


ఇదిలా ఉండగా.. ఆ తర్వాత రాష్ట్రం కర్ణాటక అనే ప్రచారం జరగుతుంది. సిద్ధరామయ్య సీటుకు బీజేపీ ఎసరు పెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా పార్లమెంట్ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున ఊహించని పరిణామాలు ఉంటాయని నిపుణుల అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ ఫలితాలను బట్టి ఆపరేషన్ కమల్ కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.


ఈ సమయంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం తుమ్మితే ఊడే ముక్కులా తయారైందని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మునగబోయే నావలాంటిదని.. తెలంగాణ మరో హిమచల్ అయితదా? లేక కర్ణాటక అవుతుందా ఎన్నికల తర్వాత చూస్తారని అన్నారు. అంటే దీని ఉద్దేశం ఆ పార్టీ బీఆర్ఎస్ తో చేతులు కలుపుతుందని చెప్పకనే చెబుతున్నారా అనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ఇదిలా ఉంటే.. బీజేపీకి  ప్రభుత్వాలను కూల్చడం వెన్నతో పెట్టిన విద్యేనని గతంలో కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్ తో పాటు రాజస్థాన్ లో చేసి కూడా చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: