ఎమ్మెల్సీ కవితకు కష్టాలు రెట్టింపయ్యాయి. దిల్లీ లిక్కర్ పాలసీలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉన్నట్లు ఈడీ, సీబీఐ అనుమానిస్తోంది. ఈ క్రమంలో తిహార్ జైల్లో ఉన్న ఆమెను తాజాగా సీబీఐ కూడా అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. అయితే ఏప్రిల్ 6న కవితను సీబీఐ విచారించింది.
లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ పాత్ర, తెరవెనుక ఎవరెవరు ఉన్నారు? లాంటి అనేక విషయాలపై లోతుగా సీబీఐ విచారణ చేపట్టింది. అయితే శుక్రవారం కవితను సీబీఐ కోర్టు ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. కోర్టు ఇచ్చే తీర్పుపై కేసు మరింత ముందుకు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అరెస్టుతో అటు దిల్లీ, ఇటు తెలంగాణలో ఆప్, బీఆర్ఎస్ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు గడ్డుకాలం నడుస్తోంది. వరసగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. మరోవైపు కవిత అరెస్టుతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తిహాడ్ జైల్లో ఉన్న ఆమెకు బెయిల్ వస్తుందేమో అనే ఆశలు పెట్టుకున్న వారికి సీబీఐ అరెస్ట్ తో రంజాన్ పూట ఆ పార్టీకి మాస్టర్ స్ర్టోక్ తగిలినట్టయింది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ఏం చేయబోతోంది అనే దానిపైనే ఇప్పుడు చర్చంతా నడుస్తోంది.


లిక్కర్ స్కాంకు సంబంధించికవితను తిహాడ్ జైల్లోనే సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. ఈ స్కాంలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి కవిత కుట్రలు పన్నారని సీబీఐ అభియోగాలు మోపింది. అంతేకాదు కవితకు ఆడిటర్ గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు వాట్సప్ చాట్ పై దృష్టి సారించింది. 100 కోట్ల ముడుపులు చెల్లించి తర్వాత భూములు కొనుగోలు చేశారని.. ఆ భూమల డాక్యుమెంట్లపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఇప్పటి వరకు కవిత అరెస్టు విషయమై కేసీఆర్ మాట్లాడకపోవడం గమనార్హం. మొత్తంమీద ఆమెకు లోక్ సభ ఎన్నికల వరకు బెయిల్ వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: