ఏపీలో ఎన్నికల వేళ మొదలైన రచ్చ ఏమాత్రం సద్దుమణగడం లేదు. ఒక వర్గం నేతలు కావాలనే ఈ తరహా ఘటనకు పాల్పడుతున్నారని ఇటీవీల జరిగిన దాడులే అందుకు ఉదాహరణలు అని కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఫ్రస్టేషన్ ను ఇలా తీర్చుకుంటున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా దాడులు మాత్రం ఆగడం లేదు.


మరోవైపు రాజకీయ విశ్లేషణలు వీరిని మరింత భయభ్రాంతుకు గురి చేస్తున్నాయి. షెఫాలజిస్టులు ఎక్కువ అయ్యే సరికి అధికార పార్టీ గెలుస్తుందని కొందరు చెబుతుంటే.. మరికొంత మంది ప్రతిపక్ష కూటమికే విజయావకాశాలు అంటూ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. దీంతో సహనం కోల్పోయిన కొంతమంది ఇక భౌతిక దాడులకు దిగుతున్నారు. ఇలా ఘర్షణలకు దిగే పార్టీ కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు ఓ సారి ఆయా పార్టీల అధినేతలను చూసి నేర్చుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.


ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లి సేద తీరుతున్నారు. గుడులు, గోపురాల చుట్టూ తిరుగుతూ మానసిక ప్రశాతంత కోసం ఆధ్మాత్మిక భావనను ఎంచుకున్నారు. పవన్ కల్యాణ్ కూడా తన ఎవరికీ కనిపించకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా గడుపుతున్నారు. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు నుంచి అనుమతి రావడంతో సతీమణి భారతితో కలిసి విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.


ఫలితాలకు పదిహేను రోజుల సమయం ఉండటంతో ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కానీ కార్యకర్తలు దాడులు చేసుకుంటూ.. వాహనాలను తగలబెడతూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఏం జరగదు అని.. వాళ్ల పని వాళ్లు చేసుకుంటారు. కానీ  మధ్యలో కొంతమంది రెచ్చగొట్టే వారి వల్ల మేం అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం అంటూ బెదిరించడం వల్ల వచ్చిన తలనొప్పి ఇదంతా.  మరి కొంత మంది కోట్లాది రూపాయలను బెట్టింగ్ రూపంలో పెట్టి ఓడిపోతామనే ఫ్రస్టేషన్ లో ఘర్షణలకు దిగుతున్నారు. అసలు ఎందుకీ తలనొప్పి అంతా. వాళ్ల అధినేతలను చూసి నేర్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: