దేశంలో బీజేపీకి అనుకున్నంత ఊపు అయితే కనిపించడం లేదు ఇప్పటికే నాలుగు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఇందులో కాషాయ పార్టీకి అనుకున్నంత సానుకూల పవనాలు వీచడం లేదని ఆ పార్టీ పెద్దలకు కూడా అర్థం అవుతున్నట్లు ఉంది. ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాదిలో కొంత ఇబ్బంది పడుతోంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు అధికారంలోకి వస్తుందా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.


ఈ నేపథ్యంలో షెఫాలజిస్టులు, రాజకీయ విశ్లేషకులు ఎవరి అంచనాలు వారు వెలువరిస్తన్నారు. తాజాగా పొలిటికల్ ఎక్స్ పర్ట్ చాడా శాస్త్రి తన అంచనాలను విడుదల చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో 4 విడతల ఓటింగ్ అయిపోయింది. ఇంకా మూడు ఫేజ్ లు జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ సరళిపై తన లెక్కలను విడుదల చేవారు.


ఆయన అంచనా ప్రకారం ఎన్డీయే ఇప్పటికే సుమారు మెజార్టీకి దగ్గరగా వచ్చింది. ఇంకా మూడు ఫేజ్ ల జరగాల్సి ఉంది కాబట్టి ఇప్పటి వరకు జరిగిన 380 సీట్లకు 225కి పైగా స్థానాలను ఎన్డీయే గెలుచుకుంటుంది. అలాగే పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, తెలంగాణలో గతంలో ఎప్పుడూ గెలవని అన్ని సీట్లు దక్కించుకోబోతుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎంపీల సంఖ్య పరంగా బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


ఏపీలో కూటమికి 3-15, అసోం 10-2 బిహార్ 17-46, ఛత్తీస్ గఢ్ 9, దిల్లీ 6, గుజరాత్  26, గోవా 2, హరియాణా 9, హిమచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, కేరళ 2, మధ్య ప్రదేశ్ 28, మహారాష్ట్ర 20-20, పంజాబ్ 3, రాజస్థాన్ 22, తమిళనాడు 3, తెలంగాణ 8, యూపీ 70, ఉత్తరాఖండ్ 4, పశ్చిమ బెంగాల్ 20 వస్తాయని పేర్కొన్నారు. మొత్తంగా బీజేపీకి 330 సీట్లు, భాగస్వామి పక్షాలకు 61తో కలుపుకొని 391 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. ఇక ఇండియా కూటమికి 136 సీట్లు వస్తే కాంగ్రెస్ కు 56 వస్తాయని అంచాన వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: