ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఓ వర్గం ప్రజలు చంద్రబాబుని.. మరో వర్గం వారు జగన్ పాలనను కోరకుంటారు. అయితే ఆయా ప్రాంత అభివృద్ధిలో రియల్ ఎస్టేర్ రంగం అత్యంత కీలకమైంది. దీని వల్ల ల్యాండ్ వాల్యూ పెరగడంతో పాటు ఆయా ప్రాంతాలకు పరిశ్రమలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు ఏం కోరకుంటున్నారు అనేది ఇక్కడ ఆసక్తికర అంశం.


గతంలో అమరావతి రాజధాని అని ప్రకటించగానే అమాంతం అక్కడి భూములకు రెక్కలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే 2019లో టీడీపీ ఓడిపోవడం.. జగన్ మూడు రాజధానుల అంశం తెరపైకి తేవడంతో ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా ఢమాల్ అయింది. ఇక అమరావతి ప్రాంతంలో రైతులు, రియల్టర్ల పరిస్థితి అయితే అత్యంత దారుణంగా మారింది. ఈ సమయంలో వారంతా తిరిగి చంద్రబాబే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.


హైదరాబాద్ లో భూమి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాదాపు ఇది ఫైనల్ స్టేజీకి చేరుకున్నాయి. ఇంతకు మించి ధరలు పెట్టి కొనుగోలు చేసి ఏం సాధిస్తాం అనే నిర్ణయానికి ఇక్కడి ప్రజలు వచ్చేశారు. బస్తీల్లో కూడా భూమి ధర రూ.కోట్లకు చేరింది. ఈ సమయంలో హైదరాబాదీ రియల్లర్లు, బిల్డర్లు ఏపీలో చంద్రబాబు రావొద్దని కోరకుంటున్నారు. విచిత్రంగా ఉంది కదూ..


ఏపీలో చంద్రబాబు ఓడితే ఓ వర్గానికి చెందిన ముఖ్యులు అంతా తెలంగాణలో పెట్టుబడులు పెడతారు. అమరావతి ఫీక్ స్టేజీలో ఉన్న సమయంలో చంద్రబాబు ఓడిపోవడంతో వారంతా కంగుతిన్నారు. ఈ సమయంలో మరోసారి టీడీపీ ఓడిపోతే వీరంతా హైదరాబాద్ లో భూములు కొనుగోలు చేస్తారు. తద్వారా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. దీంతో పాటు ఏపీలో మద్యం షాపులను ప్రభుత్వ పరం చేయడంతో తెలంగాణలో టెండర్లకు మంచి గిరాకీ  వచ్చింది. ఈ వేలంలో ఎక్కువ మంది ఆంధ్రాకి సంబంధించిన వారే పాల్గొన్నారు. అందుకే మరోసారి చంద్రబాబు ఓడిపోతే ఇక శాశ్వతంగా పెట్టుబడులు హైదరాబాద్ కు వస్తాయని ఇక్కడి రియల్టర్లు, బిల్డర్లు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: