కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి.. ఈసారి ఎన్నికల ప్రక్రియ ఆసాంతం మీడియాలో ప్రముఖంగా వినిపించిన పేరు ఇది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాగానే అధికార యంత్రాంగం అంతా ఈసీ చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈసీ ప్రతినిధిగా సీఈవో.. రాష్ట్రంలో సీఎస్‌దే అన్ని నిర్ణయాల్లో కీలక పాత్రగా ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏతో చంద్రబాబు జట్టు కట్టింది కూడా ఎన్నికల్ ప్రక్రియలో కాస్త వెసులుబాటు లభిస్తుందనే. ఎలక్షనీరింగ్‌లో అధికారుల తోడ్పాడు కూడా అవసరమే అన్నది అందరికీ తెలిసిన రహస్యమే.


జవహర్‌ రెడ్డి.. జగన్‌ నమ్మినబంటు అని చెబుతారు. జవహర్‌ రెడ్డికి సీఎం జగన్ మెుదట్నుంచి ప్రాధాన్యత ఇచ్చారు. జవహర్‌ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత మరింత పెరిగింది. సీఎం జగన్ ఆయన్ను ఆరోగ్య శాఖ కార్యదర్శిగా, టీటీడీ ఈవోగా, సీఎం స్పెషల్‌ సెక్రెటరీగా నియమించుకున్నారు. సమీర్ శర్మ డిసెంబర్‌ 30న పదవీ విరమణ చేశాక జవహర్ రెడ్డి సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. జవహర్‌ రెడ్డి సీఎస్‌గా 2024 జూన్ వరకు సర్వీస్‌లో ఉండే జవహర్‌ రెడ్డిని సీఎం జగన్‌ సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే సీఎస్‌ను చేశారన్న టాక్‌ అప్పట్లో నడించింది.


తనపై జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని జవహర్‌ రెడ్డి కూడా నిలబెట్టుకున్నారనే చెప్పాలి. ఎన్నికల సమయంలో ఎన్డీలో భాగంగా ఉన్న టీడీపీ ఎంతగా ఒత్తిళ్లు చేసినా.. జవహర్‌రెడ్డి మాత్రం అంత సులభంగా లొంగలేదు. ప్రత్యేకించి పింఛన్లను వాలంటీర్ల ద్వారా ఇవ్వొద్దని నిమ్మగడ్డ లాంటి వాళ్లు ఈసీని ఆశ్రయించిన ఇష్యూ బాగా చర్చకు దారి తీసింది. దీన్ని అవకాశంగా తీసుకుని సీఎస్‌ జవహర్‌ రెడ్డి పింఛన్ల విషయంలో వృద్ధులను ఇబ్బంది పెట్టారని ఎల్లో మీడియా ఎంత కోడై కూసినా జహవర్‌ రెడ్డి మాత్రం తగ్గలేదు.


ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు రోజూ సీఎస్‌ను లక్ష్యంగా చేసుకుని పేజీల కొద్దీ కథనాలు రాసినా జహవర్‌ రెడ్డి మాత్రం వెరలేదనే చెప్పాలి. మీరంత రాసుకున్నా.. నేను చేసేదే చేస్తా అన్న రీతిలో ఆయన ముక్కుసూటిగా వ్యవహరించారు. ఈ విషయంలో సీఎస్‌.. జగన్‌ కు పూర్తి అండగా నిలిచారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: