తెలంగాణలో నిరుద్యోగం రూపుమాపేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఆలోచన చేస్తున్నారు. రూ.2,324.21 కోట్లతో ఐటీఐలను ఆధునీక‌రించబోతున్నారు. మ‌ల్లేప‌ల్లి ఐటీఐలో ఏటీసీల‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. తెలంగాణ‌లోని 65 ఐటీఐల‌ను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసేందుకురాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాల‌జీస్ లిమిటెడ్ (టీటీఎల్‌)తో ప‌దేళ్లకుగానూ అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకుంది.


ఈ ఒప్పందం ప్రకారం.. 65 ఐటీఐల‌ను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేస్తారు. ఆధునిక ప‌రిశ్రమ‌ల‌కు అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఏటీసీల్లో యువ‌త‌కు శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఏటీసీల్లో అధునాత‌న సామ‌గ్రి, సాంకేతిక‌త ఏర్పాటు చేస్తారు. శిక్షణ ఇచ్చేందుకు 130 మంది  నిపుణుల‌ను టీటీఎల్ నియ‌మిస్తుంది.  ఏటీసీల్లో ఏటా 15,860 మందికి ఆరు ర‌కాల దీర్ఘ కాల (లాంగ్ ట‌ర్మ్‌) కోర్సుల్లో, 31,200 మందికి 23 ర‌కాల స్వల్ప కాలిక (షార్ట్ ట‌ర్మ్‌) కోర్సుల్లో శిక్షణ అందిస్తారు.


ఐటీఐల‌ను ఏటీసీలుగా మార్చే ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2,324.21 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.307.96 కోట్లు (13.26 శాతం) కాగా టీటీఎల్ వాటా రూ.2016.25 కోట్లు (86.74)గా ఉంది. ఏటీసీలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్షణకే ప‌రిమితం కాకుండా  నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా ప‌ని చేస్తాయి. ఏటీసీల్లో వివిధ కోర్సుల్లో శిక్ష‌ణ పొందిన వారికి టీటీఎల్ ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంది.


తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగ సమస్య అత్యంత కీలక పాత్ర పోషించిందని భావిస్తున్న రేవంత్ రెడ్డి.. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగఅవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అంటోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐ లు నిరుపయోగం మారాయని.. వాటిలో నేర్పించే నైపుణ్యాలు విద్యార్థులకు ఉపయోగం లేకుండా పోయాయని భావిస్తోంది. ఇంకా 40, 50 ఏళ్ల కిందటి నైపుణ్యాలను ఐటీఐల్లో నేర్పిస్తున్నారని.. విద్యార్థులు, నిరుద్యోగులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని రేవంత్ రెడ్డి అంటున్నారు. నా ఆలోచనల నుంచి వచ్చిందే ఏటీసీ అంటూ రేవంత్‌ రెడ్డి చెప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: