జగన్‌ను అస్సలు వదలొద్దు.. నన్ను చంపాలని చూశారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక చైర్మన్ కె.ఆర్ సూర్య నారాయణ అంటున్నారు. ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నానని గత ప్రభుత్వం తనను అణిచి వేయాని చూసిందని.. తనపై ఈ కేసు పెట్టారో చెప్పాకుండా విచారణకు పిలిచేవారని..ఐఏఎస్ లు ఇంతలా దిగజారిపోయి ప్రవర్తించడం నా ఉద్యోగ జీవితంలో ఎప్పుడు చూడలేదని  సూర్య నారాయణ అంటున్నారు.


నాపై కేసు పెట్టి విచారణ పేరుతో నా కుటుంబాన్ని కూడా వేదింపులకు గురి చేశారన్న  సూర్య నారాయణ.. నా భార్య మేడలో నల్లపుల గొలుసు కూడా పోలీసులు తీయించారు.. నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులను మోహరించారు.. నేను ఏమన్నా సంఘ విద్రోహ శక్తినా.. హైదరాబాద్ లో మా మామ గారి ఇంటికి వెళ్లి పోలీసులు భయందోళనలు సృష్టించారని.. రాత్రి సమయంలో కూడా పోలీసులు అక్కడే ఉన్నారు.. నా ఇంటికి సీల్  వేసే అధికారం పోలీసులకు ఎక్కడిదని  సూర్య నారాయణ ప్రశ్నించారు.


నా కుటుంబాన్ని వేధించిన పోలీస్ అధికారులు రావి సురేష్ రెడ్డి, భాస్కర రావులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూర్య నారాయణ డిమాండ్ చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి ఒక దినపత్రికలో తనపై వచ్చిన వార్త ఆధారంగా తనపై చర్యలు తీసుకోవడానికి సిద్దపడ్డారని.. మరి జవహర్ రెడ్డి మీద వచ్చిన వార్తలకు ఆయన మీద ఏం చర్యలు తీసుకోవాలని సూర్య నారాయణ అంటున్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వైకాపా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ ల దృష్టికి తీసుకువెళ్లుందుకు ప్రయత్నించారని.. ప్రభుత్వం నా ఫోన్ ట్యాప్ చేసి వారిని కలిస్తే నిన్ను దేవుడు కూడా కాపాడలేడని బెదిరించారని.. చంద్రబాబును కలిసిన తరువాత పోలీసులు నా డ్రైవర్ ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారని సూర్య నారాయణ గుర్తు చేసుకున్నారు.


సూర్యనారాయణ దొరికాడా అంటూ పోలీసులకు సజ్జల రామకృష్ణ రెడ్డి ఫోన్ చేయడం నా డ్రైవర్ విన్నాడన్న సూర్య నారాయణ.. నేను దొరికితే చంపేయండి అంటూ సజ్జల పోలీసులను ఆదేశించారని అన్నారు. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన వారికి ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని.. అందుకే తొలి మంత్రివర్గ సమావేశంలోనే జూడిషియల్ ప్రివ్యూ కమిషన్ ను నియమించాలని సూర్య నారాయణ డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: