ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలామందికి ఫైటర్గా కనిపించారు. అదే ఆయనను సీఎం పీఠం దగ్గర చేసింది ... కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది కూడా హైదరాబాదు లాంటి నగరాన్ని పెట్టుకుని కూడా సీఎం రేవంత్ రెడ్డి హ్యాండ్సప్ అంటున్న తిరిగి చూసి ఆయన క్యాబినెట్లో మంత్రులు కాంగ్రెస్ నేతలు కూడా అవాక్కు అవుతున్నారు. ఒకవైపు తెలంగాణ రైజింగ్ అని ప్రచారం చేసుకుంటూ ఇప్పుడు స్వయంగా తన నోటితో చెప్పులు ఎత్తుకుపోయేలా వాళ్లలా చూస్తున్నారు అంటూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడటం చూసి కీలక స్థానంలో ఉన్న నాయకులతో పాటు ... అధికారులు కూడా షాక్‌కు గురవుతున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్ పై స్పందిస్తూ రేవంత్ రెడ్డి వాడిన భాష చూసి ఆయన సహచర మంత్రులు కూడా రేవంత్ రెడ్డికి ఏమైంది అని చర్చించుకునే పరిస్థితి. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ఆ విషయం చెప్పడం ఏమాత్రం తప్పు కాదు ... ఉద్యోగ సంఘ నేతలతో మాట్లాడి అందుబాటులో ఉన్న పరిష్కార మార్గాలు వెతకటం అధికారంలో ఉన్నవాళ్లు చేయాల్సిన పని.


ఉద్యోగులకు చట్టబద్ధంగా రావాల్సిన బకాయిలు పెండింగ్లో పెట్టిన వ్యవహారం ఇప్పుడు కొత్తగా చ‌ర్చ కు వచ్చింది.. ఏమీ కాదు ...అది బిఆర్ఎస్ పాలనలోనే ఉంది.. అయినా అధికారంలో ఉన్న పార్టీ బకాయిలతో పాటు ఇతర విషయాలు పరిష్కరించాలి. రేవంత్ రెడ్డి కొద్ది నెలల క్రితం తమ పోటీ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ..తమిళనాడు .. కర్ణాటక రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఇది చెప్పి రెండు మూడు నెలలు గడవక ముందే రేవంత్ రెడ్డి రివర్స్ గేరు వేయడం చూసి అవాక్కవుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాల డిమాండ్లు కరెక్ట్ గా వినిపించిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం గొంతేమో కోరికల‌లా ఎలా కనిపిస్తున్నాయి అన్న ప్రశ్న ఉదయిస్తుంది.


ఏది ఏమైనా యేడాది కాలంలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పై వివిధ వర్గాల ప్రజలు తీవ్రమైన అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికి రేవంత్ రెడ్డికి ఇంకా పాలనలో పట్టు చిక్క‌నేకలేదు అనే వ్యాఖ్యలు కూడా ప్రభుత్వ వర్గాలలో ఉన్నాయి. పదేళ్ల తర్వాత వచ్చిన అధికారం ఏమాత్రం సద్వినియోగం చేసుకోకుండా టీఆర్ఎస్ పార్టీని బెటర్ అనే పరిస్థితి కాంగ్రెస్ నేతలు కల్పిస్తున్నారు అనే చర్చ కూడా రాజకీయ వర్గాలలో నడుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: