కొత్త నిబంధనల ప్రకారం వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా రోజుకు గరిష్ఠంగా డెబ్భై వేల మందికి మాత్రమే దర్శన అనుమతి ఉంటుంది. స్పాట్ బుకింగ్ కింద ఐదు వేల మందికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. వర్చువల్ బుకింగ్ లేని ఏ భక్తునూ నీలక్కల్ నుంచి పంపలకు అనుమతించబోమని పతనంతిట్ట జిల్లా ఎస్పీ ఆనంద్ స్పష్టం చేశారు. స్పాట్ బుకింగ్ సౌకర్యం నీలక్కల్, వండిపెరియార్ సత్రం, ఎరుమెలి, చెంగన్నూర్ లలో మాత్రమే ఉంటుంది.
ఈ ఆదేశాలను అన్ని రాష్ట్రాలకు పంపిన కేరళ ప్రభుత్వం భక్తులు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం కూడా ఈ విషయాన్ని తమ రాష్ట్ర పోలీస్ యూనిట్లకు, ఆర్టీసీ అధికారులకు తెలియజేసింది. బుకింగ్ లేకుండా వెళ్తే నీలక్కల్ వద్దే తిప్పి పంపే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించింది.
ఈ కఠిన నియమాలతో భక్తులు నిరాశ చెందకూడదని, ముందుగానే ఆన్‌లైన్ బుకింగ్ పూర్తి చేసుకుని సురక్షితంగా దర్శనం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మకరజ్యోతి సీజన్‌లో రద్దీ అత్యధికంగా ఉండే నేపథ్యంలో ఈ ఆంక్షలు అనివార్యమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయ్యప్ప మాలధారులు ఈ మార్పులను గమనించి ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ఉత్తమం.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి