తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీ ఇంజినీరింగ్ సెట్, బీటెక్ రెండో సంవత్సరంలో చేరేందుకు పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం విద్యార్థులకు జరిపే ఈసెట్ ప్రవేశ పరీక్షల ఫలితాలు వారం రోజుల లోపే వెల్లడి కానున్నాయి. పీజీ ఈసెట్‌కు దాదాపు 45-50 వేల మంది హాజరవుతారు. మొత్తం 18 సబ్జెక్టుల్లో నిర్వహించే ఈ పరీక్షను ఇప్పటివరకు నాలుగు రోజులపాటు జరుపుతున్నారు. ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నందున వారం రోజులపాటు జరపాలని భావిస్తున్నారు. మరో వైపు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించడంపైనా ఆలోచన చేస్తున్నారు. అదే జరిగితే గతంలో మాదిరిగానే నాలుగు రోజుల్లోనే పరీక్షలు ముగుస్తాయి.


Image result for pgecet

ఈసెట్‌ను దాదాపు 20 వేల మంది రాస్తున్నారు. ఇప్పటివరకు ఒక రోజే పరీక్ష జరుగుతుండగా ఇక దాన్ని రెండు నుంచి మూడు రోజులపాటు జరపాలని భావిస్తున్నారు. * ఫలితాలు త్వరగా...ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తే అదేరోజు ఫలితాలు ఇవ్వొచ్చు. కాకపోతే ఫలితాల కమిటీ భేటీ అయి ఆమోదం తెలపాలి కాబట్టి రెండో రోజు ఫలితాలు ఇవ్వడానికి వీలవుతుంది. అయితే 'కీ'పై అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. అందుకు రెండుమూడు రోజుల సమయం ఇవ్వాలి. అయినప్పటికీ పరీక్షలు ముగిసిన తర్వాత వారం రోజులలోపు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. గతంలో పీజీ ఈసెట్ ఫలితాల విడుదలకు 20 రోజులు పట్టేది. గత ఏడాది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేట్ పార్ట్ టైమ్(ఎంటెక్ సాయంత్రం కోర్సు) పరీక్షను 500 మందికి ఆన్‌లైన్‌లో నిర్వహించారు. అదే రోజు ఫలితాలు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: