తెలంగాణలో డిగ్రీ విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌(ఐపీఎం), గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్ల నియామకాలను తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ( టీఎస్‌పీఎస్సీ) పర్యవేక్షిస్తోంది.

 

 

ఈ మేరకు నోటిఫికేషన్ వెలువరించింది. ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ మొత్తం ఖాళీలు: 36 ఉన్నాయి. ఇందులో ఐపీఎం-10, జీహెచ్‌ఎంసీ-26 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత అర్హత.

 

 

వయసు: 18-34 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 25 వరకూ అప్లయ్ చేసుకోవచ్చు. ఎంపిక ఆన్‌లైన్‌/ ఓఎంఆర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఉంటుంది.

 

 

మరిన్ని వివరాల కోసం https://tspsc.gov.in/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు. పోస్టుల సంఖ్య తక్కువగా ఉందని నిరాశ చెందవద్దు. ఇదే కారణంతో చాలా మంది దరఖాస్తు చేయకపోవచ్చు. కష్టపడి చదివితే ఈ 36 ఉద్యోగాల్లో ఒకటి మీదే కావచ్చు. ఆల్ ద బెస్ట్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: