రైల్వేలో ఉద్యోగం కోరుకునేవారికి అనేక అవకాశాలు లభిస్తున్నాయి. అయితే కొంద‌రికి నోటిఫికేష‌న్స్ ప‌డుతున్నాయ‌ని తెలియ‌క మంచి మంచి ఉద్యోగాల‌ను మిస్ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. రైల్వేకు చెందిన వేర్వేరు జోన్లు వరుసగా నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నాయి. కొంతకాలం క్రితం 2792 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఈస్టర్న్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు వాస్తవానికి 2020 ఫిబ్రవరి 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. మార్చి 13 చివరి తేదీగా ప్రకటించింది ఈస్టర్న్ రైల్వే. 

 

అయితే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి తేదీలను సవరిస్తూ నోటీస్ జారీ చేసింది. ఆ నోటీస్ ప్రకారం 2020 మార్చి 5న అంటే ఇవాళ్టి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక ఈస్టర్న్ రైల్వేలో 2792 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 4 చివరి తేదీ. మొత్తం 2792 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈస్టర్న్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్లలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తారు. 

 

ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను http://www.rrcer.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. విద్యార్హత..10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. మ‌రియు 15 నుంచి 24 ఏళ్లు వ‌య‌స్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు విష‌యానికి వ‌స్తే.. రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగులకు ఫీజు లేదు.

 

ఇక మొత్తం 2792 ఖాళీలు ఉండగా అందులో ఫిట్టర్- 1070, వెల్డర్-547, మెకానిక్ (ఎంవీ)- 9, మెకానిక్ (డీజిల్)- 123, బ్లాక్‌స్మిత్- 9, మెషినిస్ట్- 74, కార్పెంటర్-20, పెయింటర్- 26, లైన్‌మ్యాన్- 49, వైర్‌మ్యాన్- 67, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్- 54, ఎలక్ట్రీషియన్- 593, మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్- 9, ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 75, టర్నర్- 67 పోస్టులున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: