కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే కొన్ని విభాగాలలో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ పోస్టులు... ఎక్కడ ఎన్ని ఖాళీగా ఉన్నాయో చూసి అందులో మీకు సరిపోయి, ఆ పోస్ట్ లకు సంబంధించి అర్హులు అయితే వెంటనే అప్లై చేసి ఉద్యోగాన్ని పొందండి. ఇక ఆ ఉద్యోగాల పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ...

 

IARI లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీల వివరాలు ఇలా... న్యూఢిల్లీలోని ఐకార్ ‌( ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌ స్టిట్యూట్‌‌ (IARI)) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో మొత్తం ఖాళీలు 18 పోస్టులు. పోస్టుల వివరాలలోకి వెళితే... రీసెర్చ్ అసోసియేట్‌‌, జూనియర్ రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్స్‌, సైంటిఫిక్  అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. వీటికి అర్హత పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌, పీహెచ్డీ ఉత్తీర్ణత ఉండాలి. ఇక ఈ ఉద్యోగాలకు వయసు 35 ఏళ్లు మించకూడదు. ఈ ఉద్యోగాలకు సెలెక్షన్ ప్రాసెస్‌ ఆన్‌ లైన్ ఇంటర్వ్యూ ద్వారా జరుగును. వీటిని ఈమెయిల్‌‌ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వీటికి దరఖాస్తుకు చివరి తేది జూన్‌ 21. పుతి వివలా కోసం www.iari.res.in వెబ్‌‌సైట్‌‌ సంప్రదించండి.

 

ఇక అలాగే BECIL‌ లో పేషెంట్ కేర్ మేనేజర్లు ఖాళీల వివరాలు ఇలా... నోయిడా లో ఉన్న భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్ ‌‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్‌ ‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌‌ (BECIL) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలలోకి వెళితే... పేషెంట్ కేర్ మేనేజర్ ‌‌(PCM) – 10. వీటికి అర్హత బ్యాచిలర్స్ డిగ్రీ (లైఫ్ సైన్స్‌), పీజీ (హాస్పిటల్‌‌ / హెల్త్‌‌‌‌కేర్‌‌) ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండాలి. వీటి కోసం ఆఫ్‌‌లైన్‌ ద్వారా అప్లై చేయాలి. అంతే కాకుండా దరఖాస్తులు పంపాల్సిన చిరునామా - డిప్యూటీ జనరల్ మేనేజర్ (HR‌‌‌‌) బీఈసీఐఎల్‌‌ హెడ్‌ ఆఫీసు, 14b, రింగ్‌ రోడ్డు, ఐపీ ఎస్టేట్‌‌, న్యూఢిల్లీ – 110002. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేది జూన్‌ 16.

మరింత సమాచారం తెలుసుకోండి: