ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్ప‌టికే ప్రపంచవ్యాప్తంగా కోటి మందికిపైగా వైరస్ బారినపడ్డారు. వీరిలో ఐదు లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కంటికి కనిపించని కరోనా దెబ్బకు అన్నిరంగాలు విలవిలలాడిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. ఇక రోజువారి కూలీల పరిస్థితి అయితే మరీ అద్వాన్నంగా తయారవుతోంది. 

IHG's jobless rate has decreased 0.7 percent

మ‌రోవైపు ఉద్యోగులు సైతం నిరుద్యోగులుగా మారుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఇండియన్ స్టాటికల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2020 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 47 ఖాళీలను ప్ర‌క‌టించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభ‌మైంది దరఖాస్తు చేయడానికి జూన్ 30 చివరి తేదీ. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. స్టాటిస్టిక్స్ / మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ / అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.

IHG't make these 12 mistakes - The Economic Times

అలాగే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థ‌లు వ‌య‌స్సు 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.upsc.gov.in/ లేదా https://upsconline.nic.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ప్రారంభం తేదీ 2020 జూన్ 10 కాగా, దరఖాస్తుకు చివరి తేదీ 2020 జూన్ 30 సాయంత్రం 6 గంటలు. అంటే ఈ రోజే లాస్ట్ డేట్‌. కాబ‌ట్టి, ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. ఇక పరీక్ష నిర్వహించే తేదీ 2020 అక్టోబర్ 16 గా ప్ర‌క‌టించింది యూపీఎస్‌సీ.


 

మరింత సమాచారం తెలుసుకోండి: