ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాలు కంటికి క‌నిపించ‌ని క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని విల‌విల‌లాడుతున్న సంగ‌తి తెలిసిందే. గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన ఈ కొత్తరకం కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు అని దేశాలు వ్యాప్తిచెందింది. ఈ క్ర‌మంలోనే క‌రోనా దెబ్బ‌కు ల‌క్ష‌ల ప్రాణాలు బ‌లైపోతున్నాయి. మ‌రెంద‌రికో ఈ వైర‌స్ సోకి.. నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే మ‌రోవైపు కరోనా కార‌ణంగా అన్నిరంగాలు కుదేల్ అయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది.

 

ఈ క్ర‌మంలోనే ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోతున్నాయి. అయితే ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-JHT 2020 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 283 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. ఇక ఇప్ప‌టికే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. 

 

పోస్టుల వివ‌రాలు చూస్తే.. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం ఖాళీలు 283 ఉండ‌గా.. అందులో జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ / జూనియర్ ట్రాన్స్‌లేటర్- 275, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- 08 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. హిందీలో మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా, ఇంగ్లీష్ సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉండాలి. రెండు దశల రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపికా విధానం ఉంటుంది. ఇక దరఖాస్తు ప్రారంభం తేదీ 2020 జూన్ 29 కాగా, దరఖాస్తుకు చివరి తేదీ 2020 జూలై 25 సాయంత్రం 5 గంటలు. మ‌రియు దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ  2020 జూలై 27 రాత్రి 11.30 గంటలుగా నిర్ణ‌యించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://ssc.nic.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: