కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. ఉన్నత విద్యార్థులకు కరోనా నిబంధనలను పాటిస్తూ క్లాసులకు నిర్వహిస్తున్నారు. మార్చి నుంచి నవంబర్ వరకు పాఠశాలలు మూత పడ్డాయి. దాదాపు ఒక ఏడాది చదువు వృదా అయ్యింది. దీంతో ఇప్పుడు ఏపి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ ప్రాధమికంగా నిర్ణయం తీసుకుంది. జూన్ 7 నుంచి 14వ తేదీ వరకు పబ్లిక్ పరీక్షలను నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు షెడ్యూల్‌ను రూపొందించారు. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది..



ఇకపోతే పదో తరగతి ఎగ్జామ్స్ క్యాలెండర్ ను కూడా ఏపి విద్యా శాఖామండలి ఎప్పుడో ప్రకటించింది. అందులో పరీక్ష జరుగు సమయాన్ని కూడా పొందుపరిచారు. ఉదయం 9 గంటల 35 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.45 నిమిషాల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.కోవిడ్ కారణంగా ఈ ఏడాది ఏడు పేపర్లు ఉండనున్నాయి. ఇందులో సైన్సుకు రెండు పేపర్లు.. మిగిలిన 5 సబ్జెక్ట్‌లకు 5 పేపర్లుంటాయి. అలాగే జూన్ 17 నుంచి జూన్ 26 వరకు స్పాట్ వాల్యుయేషన్  ను నిర్వహించనున్నారు.



అనంతరం జూలై 5న పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని అధికారులు చర్చించి నిర్ణయించారు.ఇక కరోనా వల్ల బడులను తిరిగి ప్రారంభించడంలో జాప్యం జరిగినందున ఈ విద్యా సంవత్సరంలో మొత్తంగా 166 రోజుల పాటు మే 31 వరకు క్లాసులు జరగనున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా కూడా కరోనా భయం ప్రజల్లో తగ్గలేదు.ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సంబంధించిన సిలబస్‌లో 30 శాతం తగ్గిస్తున్నట్లు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి వెల్లడించింది.. పూర్తి సమాచారాన్ని అఫీషియల్ వెబ్‌సైట్ bie.ap.gov.inలో ఉంచినట్లు పేర్కొంది..


పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను పరిశీలిస్తే..

జూన్ 7 – మొదటి భాష, మొదటి భాష కాంపోజిట్
జూన్ 8 – రెండో భాష ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్(సంస్కృతం, అరబిక్, పార్మీ)
జూన్ 9 – మూడో భాష(ఆంగ్లం)
జూన్ 10 – గణితం
జూన్ 11 – భౌతిక శాస్త్రం
జూన్ 12 – జీవ శాస్త్రం
జూన్ 14 – సాంఘిక శాస్త్రం

మళ్లీ ఆగష్టులో మరో ఏడాది సిలబస్ ను మొదలబెట్టనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: