చాలాకాలం తరగతులు లేకుండానే గడిచిపోవడం, మిగతా సమయం తక్కువగా ఉండడంతో ఆయా విద్యాసంస్థలు కూడా త్వరగా సిలబస్ ముగించి రివిజన్ చేయించే సన్నాహాల్లో పడ్డాయి.ఫలితంగా విద్యార్థులు మానసికంగా ఇబ్బందిపడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్ పరీక్షలతోపాటు ఎక్కువమంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు హాజరవుతుంటారు. ఈసారి జేఈఈపై విద్యార్థులు ఒత్తిడికి గురికావలసిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు.
మాములుగా ఈ పరీక్షలను ప్రతి ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించారు. ఇప్పుడు ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు, మార్చి 15 నుంచి 18 వరకు, ఏప్రిల్ 27 నుంచి 30 వరకు, మే 24 నుంచి 28 వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అయితే ఇప్పుడు ఈ పరీక్షలను ఎన్ని సార్లు రాసిన వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారని వెల్లడించారు.జేఈఈలో బీఈ, బీటెక్‌లకు పేపర్-1, బీఆర్క్‌కు పేపర్-2ఏ, బీ, ప్లానింగ్‌కు పేపర్-2బీగా మూడుపేపర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్-1లో మొత్తం 90 ప్రశ్నల్లో 75 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది. మొత్తం ప్రశ్నల్లో మ్యాథ్స్, ఫిజిక్సు, కెమిస్ట్రీలలో ప్రతి పరీక్షలో 30 మార్కులు చొప్పున ఉంటాయని పేర్కొన్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి