ప్రస్తుతం 2021 వ సంవత్సరం విద్యార్థులను పరుగులు పెట్టిస్తుంది. గత ఏడాది అద్దంతరంగా ఆగిన పరీక్షలు, ఉద్యోగాలను ఈ ఏడాది మొదటి నుంచి నిర్వహిస్తున్నారు. కాగా, ఇప్పుడు మరో పరీక్షలను నిర్వహించడానికి నోటిఫికేషన్ ను ఏపి సర్కార్ విడుదల చేసింది. ఏపి లో ఎంసెట్ పరీక్షల నిర్వహణ తేదీని ఖరారు చేస్తూ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీ ఎంసెట్‌ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లు, పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగించారు. జులై 12 నుంచి 15 వరకు ఇంజినీరింగ్‌ పరీక్షను నిర్వహిస్తారు.


నాలుగు రోజులపాటు 8 విడతలుగా పరీక్ష ఉంటుంది. బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులకు 19, 20వ తేదీల్లో 2 రోజులపాటు నాలుగు విడతలుగా పరీక్ష నిర్వహిస్తారు. దీని తర్వాత ఈసెట్‌ నిర్వహించనున్నారు.పాలిటెక్నిక్‌ పరీక్షల తేదీలు ఖరారు కానందున ఈ తేదీలపై ఇంకా స్పష్టత రాలేదు. చివరి సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూలును పంపించాలని సాంకేతిక విద్యాశాఖను ఉన్నత విద్యామండలి కోరింది.ఈ సంవత్స రం ఆలస్యంగా క్లాసులు మొదలైన నేపథ్యంలో డిగ్రీ విద్యార్థులకు ఆగస్టు 6 వరకు క్లాసులను కొనసాగించాలని సర్కార్ నిర్ణయించింది.


డిగ్రీ పరీక్షల షెడ్యూలును అనుసరించి ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబరు మొదటి వారం నుంచి ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీ ఈసెట్‌ లాంటివి నిర్వహించనున్నారు. డిగ్రీ పరీక్షల ఫలితాల అనంతరం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఆగస్టులో సెమిస్టర్‌ పరీక్షలు పూర్తయినా ఫలితాలు వచ్చేందుకు నెల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అక్టోబరులో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు.ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్‌ రవీంద్రను రెండోసారి నియమించారు. మొత్తం ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఉండగా, 3 ప్రవేశ పరీక్షల బాధ్యతలను ఆంధ్ర వర్సిటీకి అప్పగించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు.. ఆ తర్వాత వెంటనే ఫలితాలను కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: