తెలంగాణ విద్యార్థులకు , నిరుద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. గత ఏడాది నుంచి వరుసగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి శుభవార్త చెప్పింది. తెలంగాణ లో త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గురువారం తెలంగాణ శాసనసభ పలు బిల్లుల కు ఆమోదం తెలిపింది. ఉద్యోగ విరమణ వయోపరిమితి 61 ఏళ్లకు పెంపు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ల పింఛను పెంపు బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది.


ఉద్యోగ విరమణ వయో పరిమితి 61 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కనీస పింఛను రూ.50వేలు, గరిష్ఠ పింఛను రూ.70 వేలకు పెంచుతూ అసెంబ్లీ ఏక గ్రీవంగా ఆమోదించింది.. ఇకపోతే ప్రభుత్వ నేతలకు ఆరోగ్య అవసరాల కు లక్ష నుంచి పది లక్షలు ఉండేలా పెంచారు. ఇందుకు సంబంధించిన బిల్లును బడ్జెట్ లో ప్రవేశ పెట్టారు. ఈ విషయం పై తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. మేనిఫెస్టో లో ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేశాం. మెరుగైన ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు. కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లు. పీఆర్సీ కమిషన్‌ నివేదికను పరిగణనలోకి తీసుకున్నాం.


వయోపరిమితి పెంపు వల్ల ఉద్యోగ ఖాళీలకు ఇబ్బంది లేదు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఖాళీలు భర్తీ చేస్తాం. రాష్ట్రం లో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం నిర్ణయించారు. త్వరలోనే అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని పేర్కొన్నారు.రాష్ట్రంలో కొత్తగా 18 జిల్లాల్లో డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శాసనసభ లో ప్రకటించారు.. ఇక్కడ కూడా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: