తెలంగాణ నిరుద్యోగులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్న జోనల్ వ్యవస్థ కు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో పాటు ఉద్యోగాలను స్థానికులచే 95 శాతం భర్తీ చేసే విధానం అమలులోకి రానుంది. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి ఇప్పటి వరకు గ్రూప్- 4, గ్రూప్- 2 నోటిఫికేషన్లు మాత్రమే విడుదల అయ్యాయి. జోనల్ తో ముడిపడి ఉన్న కీలక ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు చేపట్టలేదు. 2011లో చేపట్టిన గ్రూప్‌-1 నియామకాల తర్వాత ఇప్పటివరకు ఆ పోస్టుల భర్తీ చేపట్టలేదు.


2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక వీటితోపాటు గ్రూప్‌-2, 3 వంటి పోస్టుల భర్తీకి కూడా జోన్ల సమస్య అడ్డుగా మారింది.2018లో అప్పటికే ఏర్పాటుచేసిన 31 జిల్లాలతో కూడిన జోన్ల విధానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కానీ ప్రభుత్వం కొత్తగా మరో రెండు ములుగు, నారాయణ్‌పేట్‌ జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త జోన్ల విధానంలో ఈ జిల్లాలు లేకపోవడంతో నియామకాల ప్రక్రియ చేపట్టలేని పరిస్థితి నెలకొంది. వీటికి సంబంధించి రాష్ట్రపతి దీనికి ఆమోద ముద్ర వేయడంతో  సంబంధిత పోస్టులకు లైన్ క్లియర్ అయిందని స్పష్టమవుతుంది.


ప్రభుత్వం రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సబ్జెక్టు నిపుణులతో కమిటీలను కూడా ఏర్పాటు చేసి సిలబస్‌ను రూపొందించింది.. రాష్ట్రం 31 జిల్లాలు మాత్రమే ఉన్నట్లు పేర్కొంది.కాగా, 33 జిల్లాలు మారిన తర్వాత జోనల్ వ్యవస్థలో ఉన్న సమస్యలు తాజాగా రాష్ట్రపతి ఆమోదం రావడంతో పోస్టుల భర్తీకి లైన్‌ క్లియర్‌ అయింది. అప్పట్లో గుర్తించిన సుమారు 3 వేల పోస్టులతోపాటు ప్రస్తుత ఖాళీలను కలుపుకొంటే 4వేలకుపైగా పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇవేకాకుండా ప్రభుత్వం భర్తీ చేయదలచిన 50 వేల ఉద్యోగాలకు కూడా కొత్త జోనల్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం.. గ్రూప్‌-1లోని కీలక పోస్టుల్లో 100 శాతం ఓపెన్‌ కోటా ఉంది. కొన్ని రాష్ట్రస్థాయి పోస్టుల్లో 50 శాతం ఓపెన్‌ కోటా కిందే ఉన్నాయి. ఈ పోస్టుల కోసం ఇక్కడివారితోపాటు ఇతర రాష్ట్రాల వారూ పోటీపడి, ఉద్యోగాలు దక్కించుకునేవారు.. ఇప్పుడు చట్టం మారింది. దీంతో 95 శాతం స్థానికులకు, 5 శాతం మాత్రమే ఓపెన్‌ కేటగిరీలో ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: