కరోనా మొదటి దశ లో కేసులు పెరుగుతున్న కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకోని పాఠశాలలను మూసివేశారు. ఈ ఏడాది కూడా కరోన రెండో దశ పెరగడం తో ఏడాది కూడా జరగవలసిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఇక జరగవలసిన పరీక్షల ను కూడా ఆయా ప్రభుత్వాలు వాయిదా వేశారు. దేశంలో కరోనా కేసులు తగ్గేవరకూ స్కూల్స్ కూడా ఓపెన్ చేసేందుకు కొన్న ప్రభుత్వం సముఖత చూపించడం లేదు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు పరీక్షలు లేకుండా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ప్రకటించారు..

తెలంగాణా లో జరగవలసిన టెన్త్, ఇంటర్ పరీక్షలను వేశారు. ఇక ఏపీ లో కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యం లో పరీక్షల ను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇది ఇలా ఉండగా తెలంగాణా లో జరగనున్న మరోపరీక్షలు కూడా వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఇటీవల ఎంసెట్(TS EAMCET 2021) దరఖాస్తుకు గడువును సైతం అధికారులు పొడిగించారు. వాస్తవానికి ఈ పరీక్ష దరఖాస్తుకు ఈ నెల 18 వరకు గడువు ఉండగా 26 వరకు పొడిగించారు అధికారులు.

తాజాగా తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే (TSRJC) పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ఈ పరీక్ష షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 28న జరగాల్సి ఉంది. ప్రస్తుతం పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు.. తిరిగి మళ్లీ ఎప్పుడు నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ పరీక్ష దరఖాస్తు గడువు ను సైతం అధికారులు పొడిగించారు. విద్యార్థులు మే 31 వరకు అప్లై చేసుకోవచ్చని సూచించారు. మరి ఈ పరీక్ష ఉంటుందా లేదా వాయిదా వేస్తారా అన్నది మాత్రం మరో ప్రకటన లో తెలియనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: