ఆరా మస్తాన్ మరొకసారి ఏపీలో జగన్ పార్టీ దే హవా అన్నట్లుగా తెలియజేశారు. దీంతో టీడీపీ కూటమి శ్రేణులు సైతం చాలా విమర్శలు కూడా చేశారు.. ఆరా మస్తాన్ కు వైసీపీ శ్రేణులు అండగా నిలుస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కూటమి నేతలు ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వేలను చాలా బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా వైసీపీకి రెండు నుంచి నాలుగు పార్లమెంటు స్థానాలుకే పరిమితమంటూ తెలియజేశారు. ఈ సంస్థ గతంలో ఇచ్చిన సర్వేలకు వచ్చిన ఫలితాలకు ఏమాత్రం సంబంధం లేదని పలువురు నేతలు నెటిజెన్స్ కూడా తెలియజేస్తున్నారు..
అసలు విషయంలోకి వెళ్తే 2023లో చతిస్గడ్ లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పగా అయితే అక్కడ బిజెపి విజయాన్ని అందుకుంది.. 2023లోనే రాజస్థాన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పగా బిజెపి విజయాన్ని అందుకుంది.2021లో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికలలో బిజెపి పార్టీ గెలుస్తుందని చెప్పగా అక్కడ తృణమాల కాంగ్రెస్ గెలిచింది. దీంతో అటు కూటమిలో కూడా ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంస్థ పైన కాస్త అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. నిజానికి రాయలసీమలో మెజారిటీ ఎంపీ స్థానాలలో వైసిపి ఎక్కువగానే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇండియా టుడే ఆక్సిస్ మై ఇండియా సంస్థ అందుకు విభిన్నంగా సర్వేలో తెలిపింది. దాదాపుగా అటు కూటమి ఇటు వైసిపిదే హవా అంటూ చాలా సర్వేలు చెబుతున్నాయి.ఏది నిజం అనేది రేపటి రోజున తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి