బంగారం రేట్లు మళ్లీ ఊపందుకున్నాయి.. నిన్న వరకు ఓ మాదిరిగా నిలకడగా ఉన్న ఈ ధరలు.. ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొనుగోలు పెరగడంతో పసిడి ధరలు పైపైకి వచ్చాయని తెలుస్తుంది. నిన్న దసరా కు ప్రజలకు ఊరటనిచ్చిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త పెరిగాయి. నగరం రెట్ల మీద ఆధారపడి వెండి కూడా పయనిస్తుంది. కానీ ఈరోజు మార్కెట్ లో వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతుంది. బంగారం ధర మాత్రం భారీగా పెరిగింది.



హైదరాబాద్ లోని మార్కెట్ లో పసిడి ధరలను చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.240 పెరగడం తో తులం బంగారం  రూ.51,510కు చేరింది.. ఇక పోతే 22 క్యారెట్ల విషయానికొస్తే 10 గ్రాములకు 220 రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం పది గ్రాములు రేటు రూ.47,220కు పెరిగింది. ఇలా చూసుకుంటే బంగారం మళ్లీ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.



బంగారం ధరల పై వెండి ధరలు కూడా ఆధారపడి ఉంటుందని తెలిసిందే.. బంగారం పెరిగిన , తగ్గిన కూడా వెండి ధర పై ప్రభావం చూపుతుంది.. కేజీ వెండి ధరలో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. దీంతో వెండి ధర రూ.62,500 వద్దనే నిలకడగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పూర్తిగా తగ్గడంతో వెండి ధరకు రెక్కలు వచ్చాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర క్షీణించింది. బంగారం ధర ఔన్స్‌కు 0.31 శాతం తగ్గుదలతో 1899 డాలర్లకు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో చేరింంది.. వెండి ధర ఔన్స్‌కు 1.17 శాతం క్షీణత తో 24.39 డాలర్లకు దిగివచ్చింది. ఈ ధరలు ఎంతవరకు స్థిరంగా ఉంటాయో చూడాలి.. బంగారం ధరలు మార్కెట్ లో డిమాండ్ ను బట్టి పెరుగుతూ తగ్గుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: