గతేడాది ఆల్‌టైమ్ అధిక ధరకు చేరుకుని మళ్లీ కిందకు దిగొచ్చిన బంగారం.. మధ్యలో మళ్లీ కాస్త పెరిగినట్టు కనిపించింది. అయితే పెళ్లిళ్ల సీజన్ ముగియడమో లేక బిట్ కాయిన్ ధరలు పెరగడం వంటి
అంతర్జాతీయ పరిణామాల వల్లో తెలియదు కానీ.. మళ్లీ పుత్తడి ధర దిగొస్తోంది. దీంతో బంగారం ధర ఎంతవరకు పడిపోతుందనే చర్చ మొదలైంది.కరోనా వైరస్ కారణంగా లాజిస్టిక్స్‌కు అంతరాయం ఏర్పడింది. డిమాండ్ కూడా పడిపోయింది. అదేసమయంలో
పసిడి ధరలు కూడా ఆకాశాన్ని తాకియి. దీంతో బంగారం కొనే వారు తగ్గిపోయారు. దీంతో
పసిడి దిగుమతులు గణనీయంగా పడిపోయాయి.బంగారం కొనుగోలు చేసేవారు కరువయ్యారు. దేశంలో
పసిడి డిమాండ్ భారీగా పడిపోయింది. బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. 2020లో బంగారం దిగుముతలు దశాబ్ద కాలం కనిష్టానికి క్షీణించాయి.
కరోనా వైరస్ ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.అయితే రేటు పెరిగినా, తగ్గినా మనం కొనాలనుకునే బంగారంలో ఎంతో కొంత కొనుగోలు చేయడం మేలు అని నిపుణులు సూచిస్తున్నారు.
స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,400 గా వుంది .అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,200 గా వుంది .అలాగే
వెండి ధర నిన్నటి కంటే బాగానే పెరిగింది .దేశ
రాజధాని ఢిల్లీలో
వెండి ధర ఏకంగా రూ.1000 మేర భారీగా పెరిగింది. నేడు 1 కేజీ
వెండి ధర రూ.65,800 అయింది. తెలుగు రాష్ట్రాల్లో
వెండి ధర రూ.800 మేర పెరిగింది.
ఏపీ,
తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ
వెండి ధర రూ.70,700కు చేరింది.
కాగా భారీ డిమాండ్ నేపథ్యంలో
2020 ఏడాదిలోపసిడి ధరలు 25 శాతం పెరిగాయి. ఆగస్టులో 10 గ్రాముల ధర రూ. 56,200 వద్ద రికార్డు స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు అధికంగా కనిపిస్తున్నాయి. దీంతో ధర తగ్గినప్పుడు కొంతమేర పుత్తడిని కొనుగోలు చేసి పెట్టుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.