నిన్న కాస్త తగ్గిన ధరలు నేటి మార్కెట్ లో దూసుకెళ్తున్నాయి..పసిడి కొనాలని భావించే వారికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎప్పటికప్పుడు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న ధరలు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. నిన్న అంతర్జాతీయ మార్కెట్ బంగారం ధరలు పెరిగిన ఇండియన్ మార్కెట్ లో స్వల్పంగా పైకి కదిలాయి. ఇది నిజంగానే పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. బంగారం ధర పరుగులు పెట్టింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది.


మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి..హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 పెరిగింది. దీంతో రేటు రూ.45,830కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.160 పెరుగుదలతో రూ.42,010కు పెరిగింది. రెండు రోజుల నుంచి స్వల్పంగా పెరుగుతూ వచ్చిన ధరలు నేటి మార్కెట్ లో ఆకాశానికి నిచ్చెనలు వేసేలా ఉన్నాయి.


బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర కేజీకి ఏకంగా రూ.700 పైకి కదిలింది. దీంతో రేటు రూ.71,400కు చేరింది. పరిశ్రమ యూనిట్లు , నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్  పెరగడం వల్ల ధరలు పెరిగాయని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.59 శాతం పెరుగుదలతో 1730 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 1.04 శాతం పెరుగుదలతో 26.17 డాలర్లకు చేరింది.కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు మొదలగు వాటి ప్రభావం వల్ల ధరలు పెరిగాయని నిపుణులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: