బంగారం కొంటున్నారా? అయితే మీకు చేదు వార్త.. నిన్న పెరిగిన ధరలు నేటి మార్కెట్ లో మరింతగా పైకి కదిలాయి. ఇది నిజంగానే షాక్ ఇచ్చే విషయమని చెప్పాలి. బంగారం ధర భారీగా పెరిగింది.. నిన్న పరుగులు పెట్టిన పసిడి రేటు ఈరోజు మాత్రం పైకి కదిలింది... బంగారం ధర కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఆశ్చర్యాన్ని కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. భారీగా పెరిగింది. 


దేశీయ మార్కెట్లో ధరలకు రెక్కలు వచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో  శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 370 పెరుగుదల తో రూ.46,900కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 350 పెరుగుదల తో రూ.43,000 కు చేరింది. ఇకపోతే బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారి లో పయనించింది. వెండి ధర రూ.800 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.71,300కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ప్రధాన కారణంగా చెప్పాలి..


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా తగ్గిన కూడా ఇండియన్ మార్కెట్ లో బంగారం ధరలు పెరగడం విశేషం. బంగారం ధర పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు మొదలగు అంశాలు పసిడి ధరల పై ప్రభావం చూపిస్తాయి.. దగ్గరి లో ఉగాది పండుగ ఉండటంతోమహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. అప్పటికి రేట్లు ఎలా మారతాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: