అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది.. అయితే , ఇండియన్ మార్కెట్ లో ధరలు కిందకు దిగి వచ్చాయి.. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.48,160కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 క్షీణితతో రూ.44,150కు తగ్గింది...
బంగారం ధర తగ్గితే వెండి కూడా అదే దారిలో నడిచింది.వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర కేజీకి రూ.600 తగ్గుదలతో రూ.73,600కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ముఖ్య కారణంగా బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పరిశీలిస్తే..బంగారం ధర ఔన్స్‌కు 0.01 శాతం పెరుగుదలతో 1778 డాలర్లకు చేరింది. బంగారం ధర పైకి కదిలితే వెండి రేటు మాత్రం తగ్గింది. ఔన్స్‌కు 0.04 శాతం క్షీణతతో 25.83 డాలర్లకు తగ్గింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు తదితర అంశాలు బంగారం ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. మరి మార్కెట్ లో రేపటి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి