పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..బంగారం ధరలు ఈరోజు మార్కెట్ లో స్థిరంగా ఉన్నాయి. నిన్న ఎటువంటి ధరలు నమోదు అయ్యాయో..దాదాపు అవే ధరలు కొనసాగుతున్నాయి..ఇది మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.ఒక రోజు రేట్లు పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడతాయి. స్థిరంగా కొనసాగుతాయి. అయితే పసిడి ధరలు ఎంత పెరిగినా.. బంగారం షాపులన్ని కొనుగోలుదారులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా దేశంలో జూలై 25న బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి..


ఈరోజు ప్రధాన మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,960 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,230 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,900 వద్ద ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,160 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,160 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,160 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210 వద్ద కొనసాగుతోంది.


ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,160 వద్ద ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,160 వద్ద ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 వద్ద ఉంది..వెండి కూడా బంగారం దారిలోనే నడిచింది..ధరల్లో ఎలాంటి మార్పులేదు. స్థిరంగా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.61,200 ఉండగా, ముంబైలో రూ.55,100, ఢిల్లీలో రూ.55,100, కోల్‌కతాలో రూ.55,100, బెంగళూరులో రూ.61,200, హైదరాబాద్‌లో రూ.61,200, విజయవాడలో రూ.61,200 ఉంది...మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: