ఎంతోమంది చాలా అందంగా కనిపించాలని చాలా ఆత్రుతగా ఉండనే ఉంటారు. అయితే పలు రకాల సమస్యల వల్ల వీరు అంద విహీనంగా కూడా కనిపిస్తూ ఉంటారు. అలా ముఖం మీద పులిపిర్ల సమస్యతో కూడా చాలామంది అందంగా కనిపిస్తూ ఉండరు. ఈ సమస్య ఈ మధ్యకాలంలో చాలామందిని బాధపెడుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది ఎక్కువగా మెడ మీద, ముఖం మీద, చేతుల మీద, పాదాల మీద కనిపిస్తూ ఉంటాయి. అయితే పులిపిర్లను అశ్రద్ధ చేయకూడదు. వీటిని తొలగించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం.


కొన్ని వెల్లుల్లి మొక్కలను తీసుకొని.. వాటి రసాన్ని తీసి.. అర చెక్క నిమ్మరసం, ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. అలా కలిపిన మిశ్రమాన్ని పులిపిర్ల మీద రాసినట్లు అయితే అవి రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఇలా దాదాపుగా కొన్ని రోజులపాటు చేయవలసి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని కనీసం మూడు గంటల పాటు అయినా ఉంచాలి. ఈ విధంగా కొద్ది రోజులపాటు చేసినట్లు అయితే పులిపిర్లు క్రమంగా రాలిపోతాయి. పులిపిర్లలో ఉండే వైరస్ ని నాశనం చేయడానికి వెల్లుల్లి లో ఉండేటువంటి రసం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.


పులిపిర్లను ఎప్పుడు కూడా కాల్చకూడదట. అలా అని కత్తిరించిన కూడా చాలా ప్రమాదమేనని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల పులిపిర్లు పెద్దగా మారే అవకాశం ఉంటుంది.అందుచేతనే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ వాటిని సులువుగా తొలగించుకోవచ్చు. ఇలాంటి వాటిని ఉపయోగించుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉన్నవారు వైద్యులను సంప్రదించాలి.



మామిడి ఆకుల రసాన్ని తీసి ఆ రసాన్ని పది రోజులపాటు పులిపిర్ల పైన పూస్తే పూర్తిగా నయమవుతాయట. ముఖ్యంగా మెడ చుట్టూ ఉండే వాటికి సూర్యకిరణాలు తగిలేలా చూసుకోవడం చాలా మంచిది. అయితే ఇలాంటివన్నీ చేసే ముందు చల్లని నీటితో శుభ్రం చేసుకున్న తర్వాతే చేయవలసి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: