ఆరోగ్యం కోసం ఫిట్ నెస్ సెంటర్లకు వెళ్లేందుకు సమయం, సౌకర్యాలు లేని వారు అతి తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే మార్గం ఒకటి ఉంది. అదే స్కిప్పింగ్.స్కిప్పింగ్ ఫిట్‌నెస్‌కు ఎలా సహాయపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..స్కిప్పింగ్ ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం. ఇది మొత్తం శరీరాన్ని ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది.స్కిప్పింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. స్కిప్పింగ్ అనేది పూర్తిగా ఒక మంచి శరీర వ్యాయామం.ప్రతి రోజూ అరగంట సేపు స్కిప్ చేయడం వల్ల మీ శరీరమంతా కూడా మంచి శక్తిని పుంజుకుంటుంది. గుండె ఆరోగ్యానికి స్కిప్పింగ్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ స్కిప్పింగ్ అనేది ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం. ఇది గుండె పనితీరును మెరుగ్గా చేయడంలో సహాయపడుతుంది. ఇది గుండెను దృఢంగా మార్చడంతో పాటు, స్కిప్పింగ్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. స్కిప్పింగ్ శరీర సమతుల్యత ఇంకా బలాన్ని కూడా మెరుగుపరుస్తుంది.


స్కిప్పింగ్ శరీర బలం సమతుల్యతను మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇక క్రమం తప్పకుండా స్కిప్పింగ్ చేయడం వల్ల శరీర సమతుల్యత చాలా బాగా మెరుగుపడుతుంది. ప్రతిరోజూ కనీసం ఒక 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయడం వల్ల కండరాలు చాలా దృఢంగా ఉండి శరీరానికి మరింత బలం అనేది చేకూరుతుంది. అలాగే బాడీలో కేలరీలను తగ్గించడంలో కూడా ఈ స్కిప్పింగ్ ఎంతగానో సహాయపడుతుంది.స్కిప్పింగ్ పురుషులు, స్త్రీలలో కేవలం ఒక నిమిషానికి 25 నుండి 30 కిలో కేలరీలు బర్న్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.  కేవలం అరగంటలో 600 కిలో కేలరీలు ఈజీగా బర్న్ చేయవచ్చు. అడుగులు దాటవేస్తూ చేసే స్కిప్పింగ్ చేయడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది. అయితే స్కిప్పింగ్ చేసేటప్పుడు ఏకాగ్రత లేకపోతే, మీరు కింద పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే, స్కిప్పింగ్ అలవాటు చేసుకోవడం వల్ల మీ ఏకాగ్రత బాగా మెరుగుపడుతుందని, మీ తెలివితేటలు ఇంకా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: