ది గ్రేట్ లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు అంటే తెలియని వారు ఉండరు.ఈయన కేవలం నిర్మతగానే కాకుండా మూవీ మొగల్ గా బిరుదు తెచ్చుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించుకున్నారు. అలాంటి రామానాయుడు వారసులు ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే పెద్దకొడుకు తండ్రి బాటలోనే నిర్మాతగా ఎంట్రీ ఇస్తే..చిన్న  కొడుకు వెంకటేష్ మాత్రం హీరోగా సెటిల్ అయ్యారు. అయితే అలాంటి వెంకటేష్ హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా మొదటి అడుగులు వేశారట. మరి ఇంతకీ వెంకటేష్ నిర్మాతగా మొదటి మూవీ ఏంటి.. అన్నకి పోటీగా నిర్మాణ సంస్థను స్థాపించాడా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రామానాయుడు పెద్దకొడుకు సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ ని స్థాపించి సినిమాల్లోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

 సురేష్ ప్రొడక్షన్ హౌస్ కి టాలీవుడ్ లో మంచి పేరుంది. ఈయన నిర్మాణంలో ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కాయి. అయితే ఈ విషయం పక్కన పెడితే గతంలో వెంకటేష్ అన్నకి పోటీగా ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారట.ఇక అసలు విషయంలోకి వెళ్తే..వెంకటేష్ సినిమాల్లోకి రాకముందు విదేశాల్లో స్టడీస్ లో చాలా బిజీగా ఉండేవారు. ఆయనకు సినిమాల మీద ఆసక్తి ఉండేది కాదు.దాంతో రామానాయుడు తన చిన్న కొడుకు వెంకటేష్ ని ఎలాగైనా సినిమాల్లోకి తీసుకువచ్చి నిర్మాతగా సెటిల్ చేయాలి అనుకున్నారు.అలా సురేష్ ప్రొడక్షన్స్ ఉన్నప్పటికీ వెంకటేష్ పేరుతో వెంకటేష్ ఎంటర్ప్రైజెస్ అనే బ్యానర్ ని స్థాపించి శోభన్ బాబు హీరోగా.. వాణిశ్రీ హీరోయిన్గా.. ఎంకి నాయుడు బావ అనే సినిమాని నిర్మించారు.

 ఈ సినిమాలో నిర్మాత స్థానంలో వెంకటేష్ పేరుని పెట్టారు.దాంతో వెంకటేష్ నిర్మాతగా మారుతున్నారని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాఫ్ అవ్వడంతో రామానాయుడు షాక్ అయ్యారు. రిజల్ట్ చూసి రామానాయుడు కి నిద్ర కూడా పట్టలేదట. దాంతో వెంకటేష్ కి కూడా సినిమాల మీద మరింత విరక్తి పుట్టింది. దాంతో మళ్లీ స్టడీస్ మీదే వెంకి తన కాన్సన్ట్రేషన్ పెట్టారట. ఆ తర్వాత కొద్ది రోజులకు కలియుగ పాండవులు సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయం చేశారు. అయితే వెంకటేష్ నటించిన మొదటి సినిమానే హిట్టు కొట్టడంతో వెంకటేష్ కి సినిమాల మీద ఆసక్తి పెరిగి ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయ్యారు. అలా ఆరోజు వెంకటేష్ నిర్మాతగా సెటిలై వుంటే ఈరోజు మనం ఒక మంచి హీరోని మిస్ అయ్యే వాళ్ళం.

మరింత సమాచారం తెలుసుకోండి: