కోలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ లో జ్యోతిక సూర్యల జంట కూడా ఒకటి..ఈ జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ నే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరూ భార్య భర్తలు అయ్యారు.అలా ఆన్ స్క్రీన్ లో వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం అద్భుతంగా ఉండడంతో పాటు మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడంతో ఈ జోడికి చాలామంది అభిమానులు ఉన్నారు. అలా సినిమాలు చేసే నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టి ఫైనల్ గా పెళ్లి చేసుకున్నారు.అయితే మొదట జ్యోతికను పెళ్లి చేసుకోవడం సూర్య తండ్రి  శివకుమార్ కి అస్సలు ఇష్టం లేదట. సూర్య జ్యోతికని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదట. జ్యోతిక మన ఇంటి కోడలుగా వద్దే వద్దు అని కరాకండిగా చెప్పేసారట. కానీ ఆ సమయంలో సూర్య తీసుకున్న నిర్ణయానికి శివకుమార్ తలవంచక తప్పలేదట. మరి ఇంతకీ శివకుమార్ కి జ్యోతిక ఇంటి కోడలు కావడం ఎందుకు ఇష్టం లేదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్య జ్యోతికలది ప్రేమ వివాహం..వీరు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.అయితే మొదట సూర్య జ్యోతికని పెళ్లి చేసుకోవడానికి సూర్య తండ్రి శివకుమార్ ఒప్పుకోలేదట. దానికి కారణం ఆయన మనసులో ఎప్పుడూ ఒకటే ఉండేదట. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎక్కువ రోజులు కలిసి ఉండలేరని ఆయన అభిప్రాయమట. అందుకే కొడుకు జీవితంలో ఎప్పటికీ సంతోషంగానే ఉండాలి అనే కారణంతో సినీ ఫీల్డ్ కు చెందిన జ్యోతిక ని ఇంటి కోడలుగా రావడానికి ఒప్పుకోలేదట. కానీ ఆ సమయంలో సూర్య నేను చేసుకుంటే జ్యోతికనే పెళ్లి చేసుకుంటా.. లేకపోతే అసలు పెళ్లి చేసుకోకుండానే జీవితాంతం ఒంటరిగా ఉంటాను అని కరాకండిగా చెప్పడంతో శివకుమార్ ఆలోచనలో పడ్డారట.

ఆ సమయంలో నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను. నేను ఇప్పటి వరకు 150 ప్రేమ కథా సినిమాల్లో నటించాను. ఎన్నో సినిమాల్లో ప్రేమను సపోర్ట్ చేసిన నేను నిజ జీవితంలో నా కొడుకు ప్రేమను మాత్రం ఎందుకు సపోర్ట్ చేయడం లేదు అని తనకు తానే సర్దిచెప్పుకొని  సూర్య జ్యోతికని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారట. అయితే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సూర్య తండ్రి స్వయంగా తెలిపారు. అలాగే తన కొడుకు జీవితంలోకి జ్యోతిక రాకముందు చాలా సైలెంట్ గా ఉండేవాడని,కానీ జ్యోతికను పెళ్లి చేసుకున్నాక వాడి జీవితం మారిపోయిందని,ఒకప్పుడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కుర్రాడేనా ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటున్నాడు అని తనకు ఎన్నోసార్లు అనిపిస్తుంది అంటూ శివకుమార్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: