క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజు ఏప్రిల్ 30వ కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో..  ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


ప్రముఖల జననాలు:



1870: భారతీయ సినిమా పితామహుడి, నిర్మాత-దర్శకుడు-స్క్రీన్ రైటర్ దాదాసాహెబ్ ఫాల్కే. (మ.1944)



1891: గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, శతావధాని, నాటకాలంకార సాహిత్యగ్రంథాలను పూర్తిచేసిన గొప్ప కవి. (మ. 1945)



1901: సైమన్ కుజ్‌నెట్స్, ఆర్థికవేత్త. (మ.1985)



1902: థియోడర్ షుల్జ్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1998)



1910: శ్రీశ్రీ, తెలుగు జాతి గర్వించే మహాకవి, 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. (మ.1983)



1921: రోజర్ లీ ఈస్టన్, అమెరికన్ శాస్త్రవేత్త.(మ. 2014)



1926: శ్రీనివాస్ ఖాలె, భారత సంగీత దర్శకుడు, (మహారాష్ట్ర) (మ.2011)



1987 : రోహిత్ శర్మ, భారత దేశ క్రికెట్ క్రీడాకారుడు.




ప్రముఖుల మరణాలు:




1883: ఎడ్వర్డ్ మానెట్, ఫ్రెంచ్ ఆధునిక చిత్రకారుడు. (జ.1832)



1945: అడాల్ఫ్ హిట్లర్, జర్మన్ నియంత. (జ.1889)



2020: రిషి కపూర్, భారతీయ నటుడు. (జ.1952)



సంఘటనలు:



1945: అడాల్ఫ్ హిట్లర్ తన భార్య ఎవా బ్రాన్‌తో కలిసి బెర్లిన్‌లోని ఫుహ్రర్‌బంకర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.



1955: ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్ చేయబడింది.



2012: భారతదేశంలోని బ్రహ్మపుత్ర నదిపై ఓవర్‌లోడ్ ఫెర్రీ బోల్తా పడి కనీసం 103 మంది మృతి చెందారు.



2013: దాదాసాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డులలో బాలీవుడ్ నటుడు రాజేష్ ఖన్నా ని "ఇండియన్ సినిమా మొదటి సూపర్ స్టార్" గా ప్రకటించారు.



1946: మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టారు.



1975: దక్షిణ వియత్నాం (సైగాన్) ఉత్తర వియత్నాం దేశానికి లొంగిపోయి వియత్నాం యుద్ధానికి ముగుంపు పలికింది.



1986: ఐ.ఎన్.ఎస్. సింధుఘోష్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరారు.



జాతీయ దినాలు:



ప్రపంచంలోని అన్ని మూలల్లో ప్రజలను ఏకం చేయడంలో ఏప్రిల్ 30ను అంతర్జాతీయ జాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: