నేడు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని తెలుసుకుంటూ కూడా.. వారాంతంలో లేదా పార్టీలలో మ‌ద్యం సేవిస్తుంటారు. మద్యం తాగడం ఓ ఫ్యాషన్‌ అయిపోయింది. మద్యానికి బానిసలై చాలామంది చావును కొనితెచ్చుకుంటున్నారు. మితంగా మద్యం తీసుకుంటే ఆరోగ్యానికి ముఖ్యంగా గుండెకు మంచిదన్న ప్రచారంతో దీన్ని సాకుగా తీసుకుని మందు గ్లాసు పట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే వాస్త‌వానికి కొద్ది మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నా అవయవాలు చెడిపోవడం ఖ‌య‌మంటున్నారు.

 

అయితే ఆల్క‌హాల్ తాగ‌డానికి కాకుండా.. వివిధ ర‌కాలుగా ఉప‌యోగించుకోవ‌చ్చు. సాధార‌ణంగా చాలా మంది తమ చెవులను క్లీన్ చేసుకునేందుకు కాటన్ బడ్స్ వాడుతుంటారు. కానీ, ఇది చాలా ప్ర‌మాదం అంటున్నారు నిపుణులు. అయితే దాని బదులు వెనిగర్, ఆల్కహాల్ మిశ్రమం ఒక కప్ లో తీసుకొని చెవిలో వేసుకుంటే చెవి క్లీన్ అవుతుంది. అలాగే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని రెండు భాగాలు నీరు, ఒక భాగం ఆల్కహాల్ వేసి సీల్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే కూల్ ప్యాక్ తయారవుతుంది.

 

దీన్ని శరీరంలోని దెబ్బలపై పెట్టుకుంటే త్వ‌ర‌గా ఉపశమనం ల‌భిస్తుంది. అదేవిధంగా, ఆల్క‌హాల్ డియోడరెంట్ గా కూడా పనిచేస్తుంది. శరీరం నుంచి వచ్చే దుర్వాసన వల్ల‌ మొదలయ్యే బాక్టీరియాను ఆల్క‌హాల్ గ్రీట్ నాశ‌నం చేస్తుంది. అయితే ఇది తాత్కాలికంగా మాత్రమే ఉపయోగించాలి లేకపోతె చర్మ సంబందిత అలర్జీలు వస్తాయి. సో.. ఆల్క‌హాల్‌ను తాగ‌డానికి యూజ్ చేయకుండా.. ఇలా ఉప‌యోగించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: