క్యాబేజీ ఉడికేటప్పుడు వచ్చే వాసన చాలా మందికి పడదు. కొంతమందికి కడుపులో తిప్పినట్లు,వికారంగా కూడా అనిపిస్తుంది. అయితే క్యాబేజీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలిస్తే మాత్రం అసలు వదలరు. అయితే క్యాబేజీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.  క్యాబేజీ తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఒక కప్పు క్యాబేజీ తరుగు లో 22 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి బరువు పెరుగుతామనే భయం లేకుండా తినొచ్చు. ముఖ్యంగా జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి క్యాబేజీ మంచి ఫలితాన్ని ఇస్తుంది.  అలాగే మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఇందులో ఉండే ఇన్ సాల్యుబుల్  ఫైబర్లు మూత్ర కదలికలను సులభతరం చేసి, మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.


క్యాబేజీ లో అధిక శాతం నీరు ఉండడం వల్ల త్వరగా ఆకలి వేయకుండా చేసి, మరే ఇతర ఆహారం వైపు వెళ్ళకుండా ఉంచుతుంది. అంతేకాకుండా శరీరాన్ని డీహైడ్రేటెడ్ గా ఉంచడానికి ఎంతగానో సహకరిస్తుంది. క్యాబేజీ,డయాబెటిస్ రోగులకు మంచి ఆహారం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ హైపర్ ప్రాపర్టీస్ అధికంగా ఉండడం వల్ల డయాబెటిస్ ఉన్నవారు చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా, క్యాబేజ్ జ్యూస్ తాగడం వల్ల కడుపులో అల్సర్లు కూడా తగ్గుతాయి. రక్తప్రసరణ వేగవంతం చేయగల శక్తి క్యాబేజి ఉంది.


 కిడ్నీలఆరోగ్య రక్షణలో క్యాబేజీ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. క్యాబేజీ లో ఉండే విటమిన్ ఎ,విటమిన్ సి, విటమిన్ బి,రిబోఫ్లేవిన్,ఫోలేట్, లాక్టిక్ యాసిడ్ లాంటి పోషకాలు కిడ్నీలోని రాళ్ళను కరిగించడంలో సహాయ పడతాయి. ఇందుకోసం క్యాబేజీ ఆకులను జ్యూస్ లా చేసి తాగితే సరిపోతుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇమ్యూనిటీ సిస్టం
నూ,బలోపేతం చేయడానికి క్యాబేజీ చాలా మంచిగా వ్యవహరిస్తుంది.  దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల సహజంగా శరీరాన్ని  డిటాక్స్ చేస్తుంది.

క్యాబేజీ లో ఉండే సల్ఫర్,ఫైబర్ కూడా టాక్సీలు పెరగకుండా చేస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ చర్మ సమస్యలు, రూమటాయిడ్ తగ్గించడంలో సహాయపడుతుంది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు స్థణాల ఆకృతిని  పెంచుకోవడానికి  ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇందుకోసం క్యాబేజీ ఆకులను తీసుకుని రాత్రి పడుకునే ముందు స్థణాల పైన పెట్టి పడుకోవాలి. ఇలా తరచూ చేస్తుండడం వల్ల అతి తక్కువ కాలంలోనే వీటి సైజు పెరగడం గమనించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: