వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా, సీజన్ ని బట్టి మనలో చాలా మందికి ఫ్లూ,  జలుబు, దగ్గు,జ్వరం ఇలాంటివి తరచూ సంభవిస్తుంటాయి. అయితే సాధారణంగా వర్షాకాలంలో, శీతాకాలంలో ఇలాంటివి సహజమని చాలామంది తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. అయితే వీటి వల్ల చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మరీ ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వీరిపై ఎక్కువ ప్రభావం చూపుతుంటాయి. కాలానుగుణంగా ఫ్లూ కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరగడం, బి.పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడం, ఊపిరితిత్తులపై ఎక్కువ బలం పడడం, బ్రెయిన్ హెమరేజ్,న్యూమోనియా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

మెదడుపై ప్రభావం చూపడం :
సీజనల్ ఫ్లూ  చాలా తీవ్రమైనప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వంటి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల మెదడును ప్రభావితం చేస్తుంది. నాడీ వ్యవస్థ యొక్క ప్రతిస్పందన పై  ప్రభావం చూపుతుంది ..మూర్చపోవడం కూడా మొదలవుతుంది.

గుండె పోటు :
సీజనల్ ఫ్లూ సమయంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారిలో గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. వైరల్ మయోకార్డియా దీనికి కారణం అని చెప్పవచ్చు.  హృదయ స్పందన రేటును పెంచి, ఊపిరాడకుండా చేస్తుంది.

మరణాలు సంభవించడం:
సీజనల్ ఫ్రూట్స్ సమయంలో క్యాన్సర్ వంటి ఏదైనా తీవ్రమైన వ్యాధితో బాధపడేవారు చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువ. సీజనల్ ఫ్లూ వారి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీనివల్ల వారి ఆరోగ్యం మరింత దిగజారిపోయి,ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది.


కాబట్టి శీతాకాలం అయినా వర్షా కాలం అయినా  ఫ్లూ వస్తే మాత్రం త్వరగా అప్రమత్తం అవ్వండి. జ్వరం, దగ్గు, చెవిపోటు, గొంతు నొప్పి, జలుబు వంటివి వస్తే చిన్నవే కదా అని ఊరుకోక డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం.కొంతమంది నిపుణులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: