మొటిమల వల్ల చాలామంది బాధపడుతుంటారు. ముఖ్యంగా  మహిళల్లో ఎక్కువగా వస్తుంటాయి. ముఖంపై ఉన్న మొటిమలపై గిల్లడం వల్ల  మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ మచ్చలు ముఖంపై వికారం గా కనబడుతుంటాయి. వీటిని తొలగించుకోవడానికి అనేక రకాల క్రీములను వాడుతుంటారు.  అయినా మొటిమలు తగ్గుతాయి కానీ మచ్చలు మాత్రం తగ్గవు. కానీ సహజమైన పద్ధతులు ఉపయోగించడం వల్ల మొటిమల ద్వారా ఏర్పడ్డ మచ్చలను తొలగించవచ్చును. ఇందుకోసం కొన్ని టిప్స్ ఇక్కడ ఉన్నాయి వాటిని ఫాలో అవ్వండి...

 ముఖం పై ఉన్న మట్టి వలె గిల్లడం వల్ల అవి మచ్చలుగా తయారవుతాయి. ఈ మచ్చలను తొలగించడానికి తేనె బాగా సహాయపడుతుంది. రాత్రి పడుకోబోయే ముందు మచ్చలపై తేన రాసుకుంటే మచ్చలు తొలగిపోతాయి.

 రాత్రి పడుకునే ముందు మచ్చలపై గంధాన్ని రోజ్ వాటర్ తో కలిపి రాయాలి. ఉదయం లేవగానే చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. చేయడంవల్ల ముఖం పైన మచ్చలు తొలగిపోతాయి.

 ముఖంపై ఉన్న మచ్చలను తొలగించడానికి కలబంద బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల చర్మ వ్యాధులను కూడా దూరం చేస్తుంది. మచ్చలు ఉన్న చోట కలబంద గుజ్జును అప్లై చేసి రాత్రంతా అలానే ఉంచి ఉదయం కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు తొలగిపోతాయి.

 ముఖం మీద మచ్చలు తగ్గడానికి బేకింగ్ సోడా తీసుకొని కొన్ని నీరు పోసి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న చోట రాసి 15  నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 నిమ్మకాయ రసం తీసుకుని మచ్చలు ఉన్న చోట దూదితో పచ్చల  పై రాయాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు  తొలిగిపోతాయి. ఎందుకంటే నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.

 ముఖంపై మచ్చలను తొలగించుకోవడానికి పసుపును ఉపయోగించడం వల్ల ఉపయోగం ఉంటుంది. పసుపులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మచ్చలు తొలగించటానికి సహాయపడతాయి. పసుపులో కొంచెం నిమ్మకాయ రసం పిండి మచ్చలున్న చోట అప్లై చేయడం వల్ల మచ్చలు మటుమాయమవుతాయి.

 బత్తాయి తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకుని ఆ పొడిలో కొంచెం తేనె కలిపి మచ్చలున్న చోట అప్లై చేసి 15  నిమిషాల తర్వాత  చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖం పై మచ్చలు తొలగిపోవడమే కాకుండా, ముఖము కాంతివంతంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: