స్త్రీ గర్భం ధరించిన నాటి నుండి తొలి దశగానే పరిగణించాలి. తల్లి తీసుకొనే జాగ్రత్తలు బిడ్డకి ఎంతగానో మేలు చేస్తాయి.గర్భంతో ఉన్నప్పుడు తన శరీరంలో క్రొవ్వు నిలువలను పెంచడం ద్వారా స్త్రీ పోషణ అవసరాలను తీర్చుకొనేందుకు తయారవుతుంది.గర్భవతులు, బాలింతలు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వారు అదనపు ఆహారం తప్పకుండా తీసుకోవాలి. రోజుకు మూడు కన్నా ఎక్కువ పూటలు భోజనం చేస్తే మరీ మంచిది.ముడి ధాన్యాలు, మొలకెత్తిన ధాన్యాలు, పులిసిన ఆహారం (పెరుగు) అదనంగా తీసుకొవాలి.


పాలు, మాంసము,కోడిగుడ్లు తీసుకోవాలి.  ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి .మందులు వైద్యుని సలహా ప్రకారమే తీసుకోవాలి.ఐరన్, ఫోలిక్ / కాల్షీయాన్ని ఎక్కువ 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభించాలి, తల్లి పాలు ఇచ్చేంతవరకు పోడిగించాలి.గర్భవతి, రోజూవారీ చేసుకొనే పనులలో నడక ఉండాలి, కాని ఎక్కువ బరువు పనులు చెయ్యరాదు, అదీ నెలలు నిండిన సమయంలో ప్రత్యేకంగా చెయ్యకూడదు.


పోగాకు లేదా మద్యపానం లాంటివి సేవించరాదు.టీ, కాఫీ తాగడంవలన, శరీరానికి కావలసినంత ఐరన్ అందదు, అందువలన భోజనం తరువాత, టీ / కాఫీ తీసుకొనరాదు.అనవసరమైన భయం ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది, గర్భము, ప్రసవము సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి.భార్యా భర్తలు నిత్యమూ సంభోగము చేయవచ్చును . అతిగా సంభోగము చేయరాదు . 8-9 వ నెలలో పొట్టపైన ఒత్తిడి పడకుండా రతిలో పాల్గొనాలి.గర్భము ధరించిన నుండి, బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేంత వరకూ రక్తదానం చేయరాదు .


మొదటి ఆరునెలలు .... నెలకొకసారి, ఏడు -ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు, తొమ్మిదోనెలలో వారానికొకసారి వైద్యపరీక్షలు అవసరము . సొంతముగా మందులు వాడడము, ఎక్సరేలు తీయించుకోవడము చేయకండి . ఎత్తు మడమల చెప్పులు వాడకండి, గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. మొదటి మూడునెలలు, చివరి నెలలో దూరప్రయాణాలు, కారు స్కూటరు నడపడము, చేయరాదు . రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి . నిద్రపోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు) తిరిగి పడుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: