ప్రతి ఒక్కరికి కడుపులో ఉబ్బరంగా అనిపించడం, పట్టేసినట్టు అనిపించడం,మెలితిప్పినట్టు అనిపించడం వంటివి  జరుగుతూనే ఉంటాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఒక్కోసారి మనకు తెలియకుండానే ఎక్కువ ఆహారం తీసుకోవడం లేదా సమయానికి ఆహారం తీసుకోకపోవడం లాంటి కారణాల వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.  ఇక  ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కడుపులో గ్యాస్ ఉబ్బరం గా అనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది..

ఇంగువ ,యాలకులు, శొంఠి , సైంధవలవణం సమానంగా తీసుకొని, మెత్తగా పొడి లాగా చేసుకుని ఉదయం, సాయంత్రం టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణం అవ్వడం తో పాటు కడుపులో ఉబ్బరం, గ్యాస్ తగ్గి శరీరం తేలికగా ఉంటుంది..


ఇక కడుపులో వచ్చే నొప్పిని తగ్గించడానికి బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ బేకింగ్ సోడా  ఆంటాసిడ్ గుణాలను కలిగి ఉంటుంది . కాబట్టి  ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది..

ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మరిగించాలి. ఇక ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే కడుపు నొప్పి సమస్యను తగ్గించుకోవచ్చు.. ఇక నిమ్మకాయ కూడా ఆరోగ్యానికి మంచి ఔషధం. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం , ఒక టేబుల్ స్పూన్ పుదీనా రసం అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం తీసుకొని,  దీనికి కొద్దిగా ఉప్పు కలిపి తాగినట్లయితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

పంచదార అలాగే జీలకర్రను నమిలి తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. పుదీనా ఆకులు, తులసి ఆకులను కలిపి నమిలినట్లయితే కడుపు సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.. ఇక మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడిని వేసుకుని తాగితే, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు

సో చూశారు కదా !  మీకు కూడా ఎప్పుడైనా కడుపు ఉబ్బరం, కడుపు నొప్పిగా అనిపిస్తే వెంటనే ఈ చిట్కాలను పాటించి త్వరిత ఉపశమనం పొందండి.


మరింత సమాచారం తెలుసుకోండి: